నిన్న జేసీ, నేడు గ‌ల్లా వంతు

త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ క‌డుతామ‌ని తాడిప‌త్రి స‌మీపంలో భూములు తీసుకుని…నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో కోర్టు ఆదేశాల మేర‌కు జేసీ దివాక‌ర్‌రెడ్డికి చెందిన భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే.…

త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ క‌డుతామ‌ని తాడిప‌త్రి స‌మీపంలో భూములు తీసుకుని…నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో కోర్టు ఆదేశాల మేర‌కు జేసీ దివాక‌ర్‌రెడ్డికి చెందిన భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. జేసీ భూముల వ్య‌వ‌హారంపై ఇంకా చ‌ర్చ సాగుతుండ‌గానే , మ‌రో టీడీపీ నేత‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వైస్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్్న అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చిన భూమిలో కొన్ని ఎక‌రాల‌ను స్వాధీనం చేసుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ రంగం సిద్ధం చేసింది.

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌పై జగన్‌ సర్కారు దృష్టి సారించింది. ఆ సంస్థకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన భూముల్లో సగం మేర వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రతిపాదనలు మంత్రివర్గానికి చేరాయి. మంత్రివర్గం లాంఛనంగా ఆమోదించడమే తరువాయి.  తొలిసారిగా 1.2 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ కలిగిన ఓ కార్పొరేట్‌ కంపెనీపై దృష్టిసారించడం చర్చనీయాంశంగా మారింది!  244.38ఎకరాలు వెనక్కు తీసుకోవాలన్న ప్రయత్నాలు మరో చర్చకు దారితీస్తున్నాయి! ఎంపీ గల్లా జయదేవ్‌ అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(వీసీఎండీ)గా ఉన్నారు. కొంతకాలంగా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

దివంగ‌త నేత వైఎస్సార్ హ‌యాంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండ‌లం నూనెగాండ్ల‌ప‌ల్లెలో అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ ప‌రిశ్ర‌మ విస్త‌ర‌ణ‌లో భాగంగా ఏపీఐఐసీ ద్వారా 483.27 ఎక‌రాల‌ను కేటాయించారు. నూనెగాండ్లప‌ల్లెలో తీసుకున్న భూమిలో అమరరాజా గ్రోత్‌కారిడార్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది.  కొత్తగా నాలుగు బ్యాటరీ ఉత్పత్తి ప్లాంట్లను నెల‌కొల్పారు. వీటిలో ఫోర్‌వీలర్‌, ఎంవీఆర్‌ఎల్‌ఏ, ట్యూబులర్‌, 2-వీలర్‌ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే తీసుకున్న మొత్తం భూమిలో సగం భూమిలో మాత్ర‌మే ప‌రిశ్ర‌మ‌లు స్థాపించారు. మిగిలిన దాన్ని ఖాళీగా ఉంచారు.

ఈ నేప‌థ్యంలో   ఈ కంపెనీకిచ్చిన భూములపై ఏపీఐఐసీతో జ‌గ‌న్ స‌ర్కార్ అధ్యయనం చేయించింది. 483.27 ఎకరాల గ్రోత్‌కారిడార్‌ ప్రాజెక్టులో 244.38 ఎకరాలను కంపెనీ ఖాళీగా ఉంచిందని ఏపీఐఐసీ.. సర్కారుకు నివేదిక సమర్పించింది. ఖాళీగా ఉన్న ఆ భూములను వెనక్కు తీసుకునేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఇటీవల పరిశ్రమల శాఖకు ఆదే శాలు వెళ్లాయి. ఆ వెంటనే ఏపీఐఐసీ నుంచి ప్రతిపాదనలు కదిలాయి.  దీనిపై మంత్రివర్గం ఆమోదించిన వెంటనే ఆ భూములను వెనక్కు తీసుకోనున్నారు. కాగా గ‌ల్లా జ‌య‌దేవ్ అమ‌రావ‌తి రాజ‌ధాని పోరాటంలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం వ‌ల్లే భూములు తీసుకుంటున్నార‌ని టీడీపీ స‌రికొత్త వాద‌న మొద‌లు పెట్టింది. కానీ ఆ భూమి ఖాళీగా ఉంద‌న్న‌ది మాత్రం నిజం.

రామ్ చరణ్ నా ప్రాణస్నేహితుడు

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా స్టోరీ ఇదే