ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో హీరో దగ్గరే తిరగదు. చాలా గుమ్మాలు ఎక్కి దిగుతుంది. కొన్నిచోట్ల నో అనిపించుకున్నా, చివరకు ఎక్కడో ఎస్ అనిపించుకుంటుంది. అలా అనిపించుకుని హిట్ కొడితే, వదిలేసిన వాళ్లు అయ్యో అని కిందామీదా అయిపోతారు. అదే ఫ్లాప్ అయితే వదిలేసుకున్న వాళ్లు, తమ జడ్జిమెంట్ కరెక్ట్ అయిందని అనుకుంటారు.
హీరో కళ్యాణ్ రామ్ వ్యవహారం ఇప్పుడు ఈ రెండో రకానికి చెందినది. కవచం సినిమా సబ్జెక్ట్ ముందుగా వెళ్లింది అతగాడి దగ్గరికే. కళ్యాణ్ రామ్ కు పెర్ ఫెక్ట్ గా వుంటుందని భావించి అతగాడి దగ్గరకు ఈ స్క్రిప్ట్ ను డైరక్టర్ శ్రీనివాస్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కానీ మరి ఎందుకు నో అన్నాడో కానీ, కళ్యాణ్ రామ్ నో అన్నాడు. బహుశా అప్పటికే ఓ పోలీస్ క్యారెక్టర్ చేయడం వల్లనో, లేదా స్క్రిప్ట్ కాస్త పాతవాసన కొట్టడం వల్లనో కావచ్చు. దాంతో అక్కడి నుంచి బెల్లంకొండ కాంపౌండ్ కు వచ్చింది.
బాగానే వుంది, పోలీస్ క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు కదా అని అటెంప్ట్ చేసాడు. కానీ ఫలితం మాత్రం అంత ఆశాజనకంగా లేకపోయింది.