Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వరుణ్ తేజ్ సినిమాకు ఊహించని దెబ్బ

వరుణ్ తేజ్ సినిమాకు ఊహించని దెబ్బ

హీరో, విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ ను చంపేశారనేది సినీ సామెత. ఇప్పుడీ సామెత అంతరిక్షం సినిమాకు అతికినట్టు సరిపోతుంది. ఎవరో, ఎవరితోనో మాటల యుద్ధం చేస్తుంటే.. ఇప్పుడా ప్రతికూల ప్రభావం అంతరిక్షం సినిమాపై పడింది.

బాలయ్య ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దాన్ని మరింత కామెడీ చేస్తూ వల్లూరి బాలకృష్ణ తెలుసంటూ మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు ఉదంతాలతో నందమూరి అభిమానులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో నాగబాబును దుమ్మెత్తిపోస్తున్న బాలయ్య ఫ్యాన్స్.. ఇప్పుడు తమ దృష్టిని అంతరిక్షం సినిమాపైకి మరల్చారు.

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమా విడుదలను అడ్డుకుంటామని ప్రకటించాయి కొన్ని జిల్లాలకు చెందిన నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్లు. ఈనెల 21న విడుదలకు సిద్ధమైన అంతరిక్షాన్ని థియేటర్లలోకి రాకుండా చేస్తామని, దమ్ముంటే తమను ఆపాలని సోషల్ మీడియాలో సవాళ్లు విసురుతున్నారు. దీంతో అంతరిక్షం సినిమాకు కొత్త చిక్కులు మొదలయ్యాయి.

ఒకవేళ గట్టి బందోబస్తు మధ్య సినిమాను విడుదల చేసినా, మొదటిరోజు నెగెటివ్ టాక్ తో హోరెత్తించడానికి నందమూరి అభిమాన వర్గాలు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. "నాగబాబును ఇప్పుడు ఏమీ అనదల్చుకోలేదు. అంతరిక్షం సినిమా వస్తోందిగా అప్పుడు చూసుకుందాం" అంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ లో తెగపోస్టులు పడుతున్నాయి. ఈ వివాదాన్ని అంతరిక్షం యూనిట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?