Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నోట మాట రావడం లేదు

నోట మాట రావడం లేదు

నిన్నటి వరకు ఎలాపడితే అలా మాట్లాడారు తెలుగుదేశం నాయకులు. ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణతో పాటు పలువురు పార్టీ సీనియర్లు కూడా తెరాస పాలనపై తమ చిత్తానికి చెలరేగిపోయారు. కానీ ఇప్పుడు టోటల్ గా ఫలితం రివర్స్ అయ్యేసరికి ఎవ్వరి నోటా మాట రావడంలేదు. ఓటమి నుంచి తేరుకుని కాంగ్రెస్ నాయకులు ఏదో ఒకటి మాట్లాడారు కానీ, పాపం, చంద్రబాబు, బాలయ్య, అండ్ కో అస్సలు పెదవి విప్పడంలేదు.

కూకట్ పల్లిలో సుహాసినిని గెలిపించడం తన బాధ్యత అని భుజాన వేసుకుని రోజుకో వార్త వండి వార్చిన తెలుగుదేశం అను'కుల' మీడియా కూడా వార్తా పలుకు లేకుండా వుండిపోయింది. అద్భుతమైన వ్యూహరచన చేసి సుహాసినిని కూకట్ పల్లి బరిలో దింపామని పడిన సంబరం అంతా ఆవిరైపోయింది.

తెలంగాణలో మహాకూటమి గెలిస్తే, మొత్తం ఘనత అంతా బాబు ఖాతాలో వేసి వుండేవారు ఈపాటికి. అందుకు అనుగుణంగా పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాయించి వదిలి వుండేవారు ఈపాటికి. ఇప్పుడు ఈ పని నెటిజన్లు చేస్తున్నారు.

బాబు కారణంగానే కాంగ్రెస్ ఇంత దారుణంగా ఓడిపోయిందని, ఆయనతో పొత్తులేకుండా వుండి వుంటే, ఇంతకన్నా కాస్త బెటర్ పొజిషన్ లో వుండి వుండేదని సోషల్ నెట్ వర్క్ ల నిండా కామెంట్లు వినిపిస్తున్నాయి. వాట్సప్ లో అయితే బాబు మీద, బాలయ్య మీద తయారవుతున్న షార్ట్ విడియోలు ఇన్నీ అన్నీకావు.

టోటల్ గా సోషల్ మీడియా రెండు విధాలుగా భావిస్తోంది. ఒకటి కేసిఆర్ గెలుపు. రెండో బాబు గారి ఘోర పరాజయం. సామాజిక వర్గ ఓట్లను చూసి, అభ్యర్థులను హైదరాబాద్ అర్బన్ లో రంగంలోకి దింపింతే, పాపం, ఓటమే ఎదురయింది.

ఇలాంటి నేపథ్యంలో ఇంక నోట ఏం మాట వస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?