కాంగ్రెస్ తేడా చేస్తే తాట తీయడం గ్యారంటీ

హంగ్ వస్తే కాంగ్రెస్ మరోసారి కర్ణాటకలో మాదిరిగా అధికారం వదులుకుని, మజ్లిస్ కు సిఎమ్ పోస్ట్ కట్టబెట్టడానికైనా రెడీ అవుతుందని గాలివార్తలు పుట్టుకువస్తున్నాయి అప్పుడే. వాస్తవానికి మజ్లిస్ ను బుజ్జగించే పని సోనియానే స్వయంగా…

హంగ్ వస్తే కాంగ్రెస్ మరోసారి కర్ణాటకలో మాదిరిగా అధికారం వదులుకుని, మజ్లిస్ కు సిఎమ్ పోస్ట్ కట్టబెట్టడానికైనా రెడీ అవుతుందని గాలివార్తలు పుట్టుకువస్తున్నాయి అప్పుడే. వాస్తవానికి మజ్లిస్ ను బుజ్జగించే పని సోనియానే స్వయంగా స్టార్ట్ చేసిన మాట వాస్తవం అని ఢిల్లీ వర్గాల బోగట్టా. ఢిల్లీ స్థాయిలో ఓవైసీల మీద వత్తిడి తెచ్చేపని స్టార్ట్ చేసారని తెలుస్తోంది. కానీ సిఎమ్ పోస్ట్ త్యాగం చేసే పని మాత్రం వుండబోదని తెలుస్తోంది.

వాస్తవానికి సోనియా కన్నా ముందే చంద్రబాబు తన చాణక్యంతో బిసి లేదా ఎస్ సిలకు సిఎమ్ పోస్ట్ ఇచ్చి, ఆంధ్రలో మార్కులు సంపాదించే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముందే పసిగట్టారని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా, చంద్రబాబు కిరికిరి చేస్తే, పరిస్థితి మామూలుగా వుండదని, ముందుగానే చాలామంది పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసేసారట.

అవసరం అయితే అన్ని పార్టీలలోని రెడ్డి సామాజిక వర్గ సభ్యులు ఒక్క తాటి మీదకు వచ్చేలా రేవంత్ రెడ్డి తదితరులు ఎన్నికల టైమ్ లోనే పావులు కదిపినట్లు తెలుస్తోంది. అసలు తెరాసపై కాంగ్రెస్ పోరు వెనుక వెలమ-రెడ్డి సామాజిక వ్యవహారాలు కూడా వున్నాయన్నది వాస్తవం. ఇలాంటి టైమ్ లో ఇంత కష్టపడి ఫలితం వచ్చాక, దాన్ని చంద్రబాబునో, మరొక్కళ్లో దూరం చేస్తామంటే, కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి కూడా సిద్దమని కొందరు రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికల టైమ్ లోనే స్పష్టం చేసారట.

వీళ్లలో బలమైన బ్రదర్స్ కూడా వున్నారని టాక్ వినిపిస్తోంది. అందువల్ల కర్ణాటక తరహా ప్రయోగం ఇక్కడ ఫలించకపోవచ్చు. పైగా అక్కడ దేవగౌడ పార్టీ సీట్లు ఎక్కువ. ఇక్కడ మజ్లిస్ సీట్లు పదిశాతం కూడా కాదు. అందువల్ల మహా అయితే డిప్యూటీ సిఎమ్, మంత్రి పదవులతో సరిపెట్టుకోవాల్సి వుంటుంది. 

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్