Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో.. రష్.. సూపర్

సాహో.. రష్.. సూపర్

బాహుబలి తరువాత హీరో ప్రభాస్ చేస్తున్న భారీ సినిమా సాహో. తెలుగులో తయారవుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమా కబుర్లు తెలుస్తున్నాయి కానీ, ఎలా వస్తోంది.. ఏం జరుగుతోంది అన్నది మాత్రం అంతగా బయటకు రావడంలేదు. అయితే లేటెస్ట్ గా ఓ విషయం మాత్రం తెలిసింది.

ఇప్పటి వరకు జరిగిన షూట్ పార్టీ నుంచి కొన్ని సీన్లు తీసి, ఓ ట్రయిలర్ మాదిరిగా కట్ చేసి, ఎడిట్ చేసి, చిన్న ఫుటేజ్ తయారు చేసారట మేకర్లు. ఎలా వస్తోందో, ఎలా అనిపిస్తోందో అన్నది, అలాగే సినిమా మార్కెటింగ్ కు ఉపయోగించడానికి. ఈ ఫుటేజ్ చూసిన వారు.. సాహో.. సాహో అంటున్నారు.

ఈ ఫుటేజ్ చూసిన ఇండస్ట్రీ పెద్దాయిన ఒకరు ఇలా అన్నారు.. ''అసలు తెలుగు సినిమా చూస్తున్నామా? హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ చూస్తున్నామా? అని అనిపించింది. ప్రభాస్ హీమాన్, అందంగా వుంటాడు అన్నది ఎలాగూ తెలుసు. కానీ ఫుటేజ్ చూస్తే మాత్రం, ఆ ఇమేజ్ డబుల్ అయ్యేలా వుంది... కచ్చితంగా ఓ రేంజ్ సినిమాలా వుంటుంది అనిపించింది''.

సాధారణంగా ఇండస్ట్రీ సీనియర్లు, పెద్దలు అంత సులువుగా సంతృప్తి చెందరు.. పొగడ్తలు కురిపించరు. అలాంటిది సాహో సినిమాకు ఈ లాంటి కితాబు ఇచ్చారంటే, కచ్చితంగా వెయిట్ చేసి తీరాల్సిన సినిమానే.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?