ఓయబ్బా ఇట్లాంటి హెచ్చరికలు ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ అయిన మా వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) సార్ ఎన్ని చూడలేదు. ఇప్పుడు కొత్తగా ఆ సునీల్ దేవ్‌దర్ హెచ్చరికలకు ఆర్కే భయపడుతాడా? అయినా ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ చేసిన తప్పేంటి? ఇప్పుడు కొత్తగా ఆంధ్రజ్యోతి -ఏబీఎన్‌పై బీజేపీ ఫైర్ కావడం ఏంటి? ఏంటో అంతా కొత్తగానూ, వింతగానూ ఉంది. ఏబీఎన్ ఏకపక్షంగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్‌దర్ ఆరోపించడం, హెచ్చరించడం ఏం బాగాలేదు.
ఆయనకు తెలుగు రాకపోవడం వల్ల ఆంధ్రజ్యోతి రాతలు, ఏబీఎన్ ప్రసారాల గురించి తెలియక బతికిపోయినట్టున్నాడు. అలా కాకపోతే ఏబీఎన్‌కి రీజాయాండర్స్ ఇచ్చినప్పటికీ….ఏ మాత్రం ఖాతరు చేయట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం ఏంటి? ఇదే వైఖరి కొనసాగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోడానికైనా వెనుకాడబోమని సునీల్ దేవ్‌దర్ హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్లిందంటే…అసలు ఏం జరిగింది?
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీకి పిలిపించుకుని తీవ్రంగా హెచ్చరించారని ఓ కథనాన్ని ఏబీఎన్‌లో ప్రసారం చేశారు. ఏపీలో జీవీఎల్ వ్యవహార శైలి వల్ల పార్టీ నష్టపోతోందని కొందరు సొంత పార్టీ నేతలు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారని, దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ కథనం సారాంశం.
ఈ కథనంపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. బీజేపీ ఏపీ ఇన్చార్జ్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించాడు. తప్పుడు వార్తలను ప్రసారం చేసి , బీజేపీ నాయకులపై దుష్ప్రచారాన్ని చేస్తోన్న ఏబీఎన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి వెనుకాడమని ఆయన హెచ్చరించాడు. జీవీఎల్‌పై పూర్తిగా అసత్యాలతో కూడిన కథనాన్ని ఆ చానల్ ప్రసారం చేసిందని ఆయన పేర్కొన్నాడు. దీనికి ఆ చానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు.
పత్రికా, మీడియా విలువలను విస్మరించి తరచూ బీజేపీపై అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించాడు. తన వైఖరి మార్చుకోకపోతే ఆ చానల్ చర్చలను బహిష్కరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించాడు. తనదాకా వచ్చే వరకు ఆ పత్రిక, చానల్ వల్ల ఏపీ ప్రజలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో బీజేపీకి నొప్పి తెలియలేదు. అసలు ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ రాసేది, కూసేది అబద్ధాలు, వక్రీకరణలని ఏపీ ప్రజలందరికీ తెలుసు.
పంది బురదలో దొర్లడం ఎంత సహజమో…ఆ మహాజర్నలిస్టు యజమాని తప్పుడు కథనాలను వండి వార్చడం అంతే సహజం. మూగవాళ్లతోనైనా మాట్లాడించ వచ్చేమో కానీ, సునీల్ దేవ్‌దర్ ఆరోపిస్తున్న ఆ పత్రిక, చానల్‌తో నిజాలు రాయించడం అసాధ్యం. సునీల్ దేవ్‌దర్ తలకిందులు తపస్సు చేసినా, ఇలాంటి హెచ్చరికలు మరో వంద చేసినా…ఆ చర్మ మందం యజమానిపై వాన కురిసినట్టే. పాపం ఈ విషయాలేవీ తెలియని సునీల్ దేవ్‌దర్ ఏవేవో హెచ్చరికలు చేశాడు.