అఖిల్ కు ఏం కాలేదు.. సినిమా ఆగలేదు

అఖిల్ గాయపడిన మాట వాస్తవమే. అతడ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లిన విషయం కూడా నిజమే. కానీ ఈ ఘటన వల్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఆ సినిమా విడుదల వాయిదా…

అఖిల్ గాయపడిన మాట వాస్తవమే. అతడ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లిన విషయం కూడా నిజమే. కానీ ఈ ఘటన వల్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఆ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వచ్చిన వార్తల్లో మాత్రం నిజం లేదు.

నిన్న చెన్నైలో జరిగిన షూటింగ్ లో అఖిల్ గాయపడ్డాడు. ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతడి కుడి మోచేయికి చిన్న గాయమైంది. అయితే అది సినిమా ఆగిపోయేంత పెద్ద గాయం కాదని యూనిట్ స్పష్టంచేసింది. తిరిగి పదో తేదీ నుంచి అఖిల్ సెట్స్ పైకి వచ్చేస్తాడని క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాను మే నెలాఖరుకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ 70శాతం పూర్తయింది. కాబట్టి అఖిల్ గాయం సినిమా విడుదల తేదీపై పెద్దగా ప్రభావం చూపించదు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు, సింగిల్స్ రిలీజ్ కార్యక్రమం మొదలైంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కెరీర్ లో ఇప్పటివరకు 3 సినిమాలు చేసిన ఈ హీరో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. అందుకే గీతాఆర్ట్స్2 బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్.

మీరు రూమర్స్ స్ప్రెడ్ చెయ్యకండి ప్లీజ్..