వైసీపీ నేతల బస్సు యాత్ర, టీడీపీ మహానాడుని టార్గెట్ చేసినట్టేననే చర్చ ఆల్రడీ వచ్చేసింది. చంద్రబాబు కూడా నేరుగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కర్నూలు యాత్రలో కన్నెర్ర చేస్తాననే డైలాగు వాడిన బాబు.. బస్సు యాత్ర మహానాడుకి వచ్చే క్రేజ్ ని అడ్డుకోడానికేనంటున్నారు.
మొత్తానికి వైసీపీ కార్యక్రమాలతో బాబులో భయం మొదలైనట్టే. కాకపోతే ఆ భయాన్ని లోపల కప్పి పెట్టుకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంతే.
బస్సు యాత్రతో భరోసా..
ఇప్పటి వరకూ వైసీపీ చేపట్టే భారీ బహిరంగ సభలన్నీ జగన్ కేంద్రంగానే జరిగేవి. కానీ ఆయన తనతోపాటు, తన నాయకులకు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తాను రాష్ట్రంలో లేని సమయంలో వారితో బస్సు యాత్ర ప్లాన్ చేశారు. 4 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర ఉంటుంది. కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మంత్రులే ఇందులో పాల్గొంటారు. నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలుంటాయి. అంటే దాదాపుగా సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ రాష్ట్రవ్యాప్తంగా జనాల్లోకి వెళ్తుందనమాట.
ఇప్పటికే గడప గడప అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లారు, ఇప్పుడు బస్సు యాత్రతో ఎన్నికల ఫీల్ ముందే వచ్చినట్టవుతుంది. అందులోనూ ప్రతి చోటా మంత్రులకు ఘన స్వాగతాలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మంత్రులకు జగన్ ఎంత ప్రయారిటీ ఇచ్చారు, పార్టీ ఎలాంటి గుర్తింపు ఇస్తుందనడానికి ఈ బస్సు యాత్ర ఉదాహరణగా నిలిచిపోతుంది.
పనిలో పనిగా చంద్రబాబు చేసిన తప్పులన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశముంది. గతంలో ఆయన బీసీలను ఓటు బ్యాంకుగా ఎలా వాడుకున్నారు, ఇప్పుడు జగన్ వారికి ఎలా న్యాయం చేస్తున్నారనే అంశం ప్రస్తావనకు వస్తుంది. సో.. ఈ బస్సు యాత్రతో బాబుకి మూడినట్టే.
మహానాడుపై భయం..
జనాలు రాకపోవచ్చనే సమాచారంతో మహానాడుని బహిరంగ వేదికలో కాకుండా.. నాలుగు గోడల మధ్య ముగించేయబోతున్నారు చంద్రబాబు. దీని కోసమే ఒంగోలులో వేదిక కూడా మార్చారు. ఇక ఆ రెండు రోజులు మీడియా ఫోకస్ అంతా తనపైనే ఉంటుందని అనుకున్నారు. కానీ వైసీపీ బస్సు యాత్రతో మీడియా ఫోకస్ కాస్త అటు కూడా ఉండాలి.
మహానాడులో టీడీపీ చేసే కామెంట్లకు.. వైసీపీ కౌంటర్లు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. అందులోనూ మహానాడు తర్వాతి రోజు కూడా వైసీపీ బస్సు యాత్ర ఉంది. అనంతపురంలో భారీ బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తుంది. అంటే లాస్ట్ పంచ్ కూడా వైసీపీదేననమాట. దీంతో బాబులో గుబులు మొదలైంది.
ప్రస్తుతానికి గడప గడపకు మన ప్రభుత్వం, బస్సు యాత్ర.. అనేవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. వీటికే బాబు హడలిపోతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో జగన్ తన ఎన్నికల స్ట్రాటజీని బాబుకి పరిచయం చేయబోతున్నారు. దాంతో 72లో 27 అని చెప్పుకుంటున్న సీనియర్ కి దిమ్మతిరగడం ఖాయం.