ఓ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఎందుకొస్తారు? సినిమాలో కొన్ని సన్నివేశాలు లేదా సాంగ్స్ బాగా నచ్చి వస్తారు. కానీ ఎఫ్3 సినిమాకు మాత్రం ఏదో మిస్ అయిపోయామనే ఫీలింగ్ తో వస్తారని చెబుతున్నాడు హీరో వెంకటేశ్. అడుగడుగునా కామెడీ పంచ్ లు పడుతుంటాయని, వాటిలో కొన్నింటిని మిస్ అయిపోయామనే ఫీలింగ్ తో చాలామంది సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారని వెంకీ అంటున్నాడు.
“ఎఫ్2లో కామెడీకి మధ్యమధ్యలో గ్యాప్స్ వస్తాయి. అక్కడో చిన్న డ్రామా ఉంటుంది. ఎఫ్3లో అది కూడా కనిపించదు. బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు పడుతూనే ఉంటాయి. చాలామంది ప్రేక్షకులు ఆ పంచ్ లు మిస్ అయిపోయారు. వాటి కోసం మళ్లీ మళ్లీ వస్తారు. నాన్ స్టాప్ గా కామెడీ పండుతూనే ఉంటుంది. ఒకేసారి ప్రేక్షకులు అన్నీ కవర్ చేయలేరు. ఓ కామెడీకి నవ్వేలోపు మరో పంచ్ అయిపోతుంది. అందుకే మరోసారి వస్తారు.”
ఇలా ఎఫ్3కి రిపీట్ ఆడియన్స్ ఎందుకొస్తారో చెప్పుకొచ్చాడు వెంకటేశ్. ఇక సినిమాలో తన యాక్టింగ్ పై స్పందిస్తూ.. తను ఏం నటించానో తనకే అర్థం కాలేదని, ఏదేదో చేసేవాడ్నని, అనీల్ ఓకే చెప్పేవాడని అన్నాడు.
“ఓ కామెడీ సీన్ చేసినప్పుడు ఫ్లోలో 5-6 రకాలు చేసుకుంటూ వెళ్లిపోతాను. ఏం చేశానో కూడా నాకు గుర్తుండదు. అనీల్ వచ్చి సర్.. అది మళ్లీ చేద్దాం అంటాడు. అదేదో నాకు గుర్తురాదు. మళ్లీ చూసుకొని, మళ్లీ చేయడమే. వరుణ్ కూడా చాలా సన్నివేశాల్లో ఫ్లోలో వెళ్లిపోయాడు. అలాంటి సీన్లు అన్నీ చాలా బాగా వచ్చాయి.”
మనీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎఫ్3 సినిమాలో కూడా ఫ్రస్ట్రేషన్ ఉందని, కానీ అది కూడా ప్రేక్షకులకు ఫన్ అందిస్తుందని చెబుతున్నారు వెంకటేశ్. ఈమధ్యకాలంలో ఇలాంటి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా రాలేదని అంటున్నారు.