విజయశాంతికి అలాంటి రోల్ కావాలంట

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుని, లాంగెస్ట్ ఇన్నింగ్స్ వున్న నటి విజయశాంతి. నటిగా, హీరోయిన్ గా ఆమె చేయని సినిమాలు లేవు. అలాంటి నటి చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా…

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుని, లాంగెస్ట్ ఇన్నింగ్స్ వున్న నటి విజయశాంతి. నటిగా, హీరోయిన్ గా ఆమె చేయని సినిమాలు లేవు. అలాంటి నటి చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఆ సినిమా తరువాత వరుసగా, చకచకా సినిమాలు చేస్తారని, ఒప్పుకుంటారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే సీనియర్ హీరోయిన్లకు తగిన పాత్రలు టాలీవుడ్ లో వున్నాయి. అలాంటి క్రేజ్ వున్న సీనియర్ హీరోయిన్ల కొరత కూడా వుంది.

కానీ విజయశాంతి సినిమాలు చేయడానికి అంత సుముఖంగా లేరని వార్తలు వినవచ్చాయి. సరిలేరు తరువాత కొత్త సినిమాల ప్రకటనలు కూడా రాలేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి వేరే వుంది. రోటీన్ ఆంటీ, అమ్మ ఇలాంటి పాత్రలు విజయశాంతి చేయరట. అలాగే సరిలేరు మాదిరిగా కీలకమైన పాత్రలు కూడా వద్దట. 

గతంలో మాదిరిగా యాంగ్రీ వుమెన్ గా, అవసరం అయితే ఒకటి రెండు ఫైట్లు కూడా వుండే పాత్రలు కావాలని విజయశాంతి కోరుకుంటున్నారని ఇండస్ట్రీ లో వినిపిస్తోంది. పూర్తి డైనమిజం వున్న పాత్రలు అయితేనే చేసే ఆలోచనలో విజయశాంతి వున్నారని బోగట్టా. ఎవరికైనా ఇంట్రస్ట్ వుంటే ఆ దిశగా ట్రయ్ చేయవచ్చేమో? 

విజయశాంతి కోరిక కరెక్ట్ నే కావచ్చు. కానీ ఈ ఏజ్ లో ఆమె పోలీస్ పాత్రలు వేసి, ఫైట్లు చేస్తే జనం ఓకె అంటారా? అన్నది అనుమానం.

ఈ విహారం పద్దతిని పాటిస్తే కరోనా సోకదు

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తినండి