భయపడినట్టే జరిగింది.. జనసైనికులు పరార్!

మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ ప్రధానంగా భయపడిన అంశం ఒకేఒక్కటి. ప్రస్తుతం జనసైనికుల్లా వ్యవహరిస్తున్న తన కల్ట్ ఫ్యాన్స్ అంతా తిరిగి సినిమాల వైపు మళ్లిపోతారని, ఇక రాజకీయాల్ని వదిలేస్తారని పవన్ భయపడ్డారు.…

మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ ప్రధానంగా భయపడిన అంశం ఒకేఒక్కటి. ప్రస్తుతం జనసైనికుల్లా వ్యవహరిస్తున్న తన కల్ట్ ఫ్యాన్స్ అంతా తిరిగి సినిమాల వైపు మళ్లిపోతారని, ఇక రాజకీయాల్ని వదిలేస్తారని పవన్ భయపడ్డారు. ఇప్పుడదే జరిగింది. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ సాక్షిగా జనసైనికులంతా తమ లక్ష్యాన్ని వదిలేశారని, మరోసారి సినీఅభిమానులుగా మారిపోయారు. వాళ్లకిప్పుడు సినిమానే లోకం.

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ఇలా వచ్చిందో లేదో జనసైనికులంతా పవనిజం స్లోగన్ అందుకున్నారు. నో పాలిటిక్స్, నో హాట్ టాపిక్స్.. ఓన్లీ సినిమా. అప్పటివరకు రాజకీయాలంటూ వైసీపీ, టీడీపీపై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేసిన వాళ్లంతా ఒక్కసారిగా సినిమా వైపు టర్న్ అయిపోయారు. ఇదేదో ఒక రోజుతో ముగిసిపోయే వ్యవహారం కాదు.

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజైనప్పట్నుంచి ఈరోజు వరకు పవన్ ఫ్యాన్స్ ఎవరూ సోషల్ మీడియాలో రాజకీయాల గురించి మాట్లాడ్డం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు క్షేత్రస్థాయిలో చేస్తున్న చిన్నాచితకా పనుల్ని కూడా పూర్తిగా పక్కనపెట్టేశారు. అందరిదీ ఒకటే స్లోగన్. జై జనసేన బదులు జై వకీల్ సాబ్ అంటున్నారు. అలా జనసైనికులంతా “హీరో” పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా మరోసారి టర్న్ అయిపోయారు.

పవన్ ఇన్నాళ్లూ ఏదైతే భయపడ్డారో అదే జరిగింది. పవన్ సినిమాల్లోకి వెళ్లిన వెంటనే, జనసైనికులు కూడా పవన్ సినిమాల్ని పట్టుకొని వేలాడడం మొదలుపెట్టారు. ఇది వకీల్ సాబ్ తో ఆగిపోయేది కాదిది. నెక్ట్స్ క్రిష్ సినిమా ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్ మూవీ ఉంది. సో.. ఓ ఏడాది తర్వాత జనసైనికులంతా జనసేన అనే పార్టీ ఒకటుందనే విషయాన్ని మరిచిపోతారేమో.

రాజకీయంగా పవన్ కు ఇదంతా మళ్లీ “రెడ్డొచ్చె మొదలు” అనే తరహాలో తయారవ్వడం గ్యారెంటీ. పవన్ మాత్రం షూటింగ్స్ గ్యాప్స్ లో, మధ్యమధ్యలో పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా ఉంటున్నట్టు కలరింగ్ ఇస్తున్నప్పటికీ.. జనసైనికులు మాత్రం పవన్ అంత త్వరగా అట్నుంచి ఇటు షిఫ్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్లకు జనసైనికులు అనే స్టేటస్ కంటే పవనిజం అనే హోదానే బాగా నచ్చింది మరి.

కరోనా సోకకుండా ఉండటానికి సులభమైన పద్ధతులు