రాష్ట్రానికి చేటు జనసేన సంకల్పమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- జనసేన పార్టీ రాజకీయాలకు సంబంధించినంతవరకు ఇక పవన్ కల్యాణ్ లేని సమావేశాలను తరచూచూడాల్సి రావచ్చు. జనసేనాని షూటింగుల్లో బిజీగా ఉండడం వలన, ఉపసేనానులు మీటింగుల ప్రహసనాల్ని నడిపిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- జనసేన పార్టీ రాజకీయాలకు సంబంధించినంతవరకు ఇక పవన్ కల్యాణ్ లేని సమావేశాలను తరచూచూడాల్సి రావచ్చు. జనసేనాని షూటింగుల్లో బిజీగా ఉండడం వలన, ఉపసేనానులు మీటింగుల ప్రహసనాల్ని నడిపిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఆ సమావేశాల్లో పవన్ తర్వాత పార్టీకి అంతటి పెద్దదిక్కు నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేటు జరగడమే.. ఈ పార్టీ లక్ష్యమా అనే అనుమానం కలుగుతోంది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నాదెండ్ల మనోహర్ మాటలు చిత్రంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను పెంచిన రిజర్వేషన్లతో నిర్వహిస్తాం అని చెప్పి వైకాపా సర్కారు ప్రజలను మభ్య పెట్టిందిట. వారి ప్రభుత్వం తెచ్చిన జీవోలు లీగల్ గా నిలబడవు అని తెలిసి కూడా ఆ పనిచేశారట. రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వైఖరి ఏమిటో జగన్ స్పష్టం చేయాలట. ఇందులో ఇంకా వైఖరి గురించిన చర్చ ఏమిటో అర్థం కావడం లేదు. జగన్ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు పచ్చజెండా ఊపేసి.. ఈ నెలాఖరులోగా అంతా పూర్తయిపోవాలని ఆదేశించారు కూడా.

ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నదని జనసేన భావిస్తున్నదట. అందుకని.. 59 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనట.! హైకోర్టు తీర్పును పాటించడం అనేది అవకాశవాద రాజకీయం అవుతుందిట.. ఇలా నాదెండ్ల నిందలేస్తున్నారు.

ఇంతకీ ఆయన ఏం చెప్పదలచుకున్నారో అర్థం కావడం లేదు. 59 శాతం రిజర్వేషన్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించదలచుకుంటే అది పెద్ద పని కాదు. హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తే ఇవాళ కాకపోతే రేపటికి తీర్పు వస్తుంది. గతంలో ఇలాంటివి అనుమతించి ఉన్న నేపథ్యంలో మళ్లీ అనుమతి కూడా వస్తుంది. అంతా అనుకున్నట్టు జరుగుతుంది. కానీ.. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు పూర్తికాకపోతే.. మూడువేల పైచిలుకు కోట్ల రూపాయల కేంద్ర నిధులు తిరిగి వెనక్కు వెళతాయి. రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అలాంటి చేటు జరగాలనే జనసేన కోరుకుంటున్నట్లుంది. స్పీకరుగా కూడా పనిచేసిన వ్యక్తి మరీ అంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తినండి

రాహుల్ సిప్లిగంజ్‌పై పబ్‌లో దాడి చేసిన ఎమ్మెల్యే తమ్ముడు