అయ్యో పాపం.. పవన్ ఏంటి ఇలా దొరికిపోయాడు!

సెలబ్రిటీలు, పొలిటీషియన్లు ఎప్పుడు ఎలా దొరికిపోతారో చెప్పడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా పొలిటీషియన్ కమ్ సెలబ్రిటీలైతే ఇంకా కష్టం. నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.  Advertisement…

సెలబ్రిటీలు, పొలిటీషియన్లు ఎప్పుడు ఎలా దొరికిపోతారో చెప్పడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా పొలిటీషియన్ కమ్ సెలబ్రిటీలైతే ఇంకా కష్టం. నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 

ఊహించని విధంగా పవన్ కల్యాణ్ పై ట్రోలింగ్ జరిగింది. పవన్ కల్యాణ్ మాత్రమే కాదు, కనీసం ఆయన ఫ్యాన్స్ కూడా ఊహించని విధంగా మొదలై, ఊహించని టర్న్ తీసుకుంది ఈ ట్రోలింగ్.

ఇంతకీ మేటర్ ఏంటంటే…

నిన్న టీవీ రేటింగ్స్ వచ్చాయి. పవన్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి విషయాల్ని పవన్, అతడి అభిమానులు, జనసైనికులు లైట్ తీసుకుంటారు. ఎప్పుడూ పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. భీమ్లానాయక్ కు వచ్చిన రేటింగ్ తో పవన్ ను చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు.

“మూవీస్ కు కలెక్షన్లు రావు.. టీవీల్లో టీఆర్పీలు రావు.. ఎన్నికల్లో సీట్లు రావు” అంటూ రేటింగ్స్ ను తీసుకొచ్చి దేనికో ముడిపెట్టారు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని ట్రోలింగ్. మెల్లగా మొదలైన ఈ చర్చ.. నిన్న సాయంత్రానికి తీవ్రరూపం దాల్చింది. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా, రాజకీయంగా పవన్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో… అన్నింటినీ స్క్రీన్ షాట్స్ తో సహా బయటపెడుతూ ఆడుకున్నారు నెటిజన్లు.

కాస్త లేటుగా స్పందించిన జనసైనికులు, పవన్ అభిమానులు కూడా గట్టిగా ప్రతిస్పందించారు. 'ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా' అంటూ సర్కారువారి పాట డైలాగ్ ను రిపీట్ చేస్తూ ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.

అయితే జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ ఎంత ప్రతిఘటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పవన్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఓ సినిమా రేటింగ్, ఇలా పవన్ కల్యాణ్ పై ట్రోలింగ్ కు కారణం అవ్వడం ఇదే తొలిసారి.