స్థానిక ఎన్నిక‌ల డేట్లు ఇవే?

ఎలాగైనా మార్చి 31వ తేదీ నాటికి ఏపీలో స్థానిక ఎన్నిక‌లు పూర్తి కావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధుల విడుద‌ల జ‌ర‌గాలంటే ఈ నెల 31 నాటికి స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను పూర్తి…

ఎలాగైనా మార్చి 31వ తేదీ నాటికి ఏపీలో స్థానిక ఎన్నిక‌లు పూర్తి కావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధుల విడుద‌ల జ‌ర‌గాలంటే ఈ నెల 31 నాటికి స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో .. ఈ మేర‌కు స్థానిక ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

ఈ నెల 21వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల పోలింగ్ ఉండ‌వ‌చ్చ‌ని, ఆ త‌ర్వాత మూడు రోజుల‌కే అంటే మార్చి 24న మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ ఉంటుంద‌ని స‌మాచారం. ఆపై 27వ తేదీన ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ మూడు ఎన్నిక‌ల ఫ‌లితాలూ.. మార్చి 31వ తేదీ లోపున విడుద‌ల అయ్యే అవ‌కాశాలున్నాయి.

ఈ తేదీల‌కే స్థానిక ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌భుత్వం స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ర‌ణ‌కు తాము సిద్ధ‌మ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ ఎన్. ర‌మేశ్ కుమార్ ప్ర‌క‌టించారు. మొత్తానికి ఇక పెద్ద‌గా గ్యాప్ లేకుండానే వ‌ర‌స‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న‌ట్టుగా స్ప‌ష్టం అవుతూ ఉంది.

కరోనా సోకకుండా ఉండటానికి సులభమైన పద్ధతులు

రాహుల్ సిప్లిగంజ్‌పై పబ్‌లో దాడి చేసిన ఎమ్మెల్యే తమ్ముడు