హీరో నిఖిల్ తో గీతా ఆర్ట్స్ సినిమా ఎప్పటి నుంచో పెండింగ్ లో వుంది. తమిళ హర్రర్ కామెడీ రీమేక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ సెట్ కాలేదు. ఆఖరికి ఇప్పటికి ఓ ప్రాజెక్టు ఫైనల్ అయింది. అది కూడా చిత్రంగా చాలా హీరోలను తిరిగి తిరిగి వచ్చిన ప్రాజెక్టు కావడం విశేషం.
కుమారి 21ఎఫ్ తరువాత దర్శకుడు సూర్య ప్రతాప్ చేసుకున్న కథ. ఇది చాలా మంది హీరోలు విన్నారు. నో అన్నారు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో సహా. కానీ గీతా బన్నీవాస్ పట్టు వదలకుండా ఆ ప్రాజెక్టును నిఖిల్ తో ఫైనల్ చేసారు. హీరోలు ఎక్కువగా కాదు అనడానికి రీజన్ మరేం కాదు. సినిమా సెకండాఫ్ ఎక్కవగా హీరోయిన్ మీద వుంటుందని తప్ప మరోటి కాదు.
అయితే నిఖిల్ స్వయంగా కొన్ని మార్పులు చేర్పులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే కుమారి 21ఎఫ్ టైటిల్ తో తొలి సినిమా చేసిన సూర్యప్రతాప్ మలి సినిమాకు 18 పేజెస్ అనే వైవిధ్యమైన పేరు పెట్టినట్లు తెలుస్తోంది. బహుశా టైటిల్ లో నెంబర్ వుండడం సూర్య ప్రతాప్ కు సెంటిమెంట్ గా మారిందేమో?