ఏపీలో కొత్త స్ట్రయిన్.. దాని పేరు NARA-420

ఆంధ్రప్రదేశ్ లో, మరీ ముఖ్యంగా కర్నూలులో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభించిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్-440కే అనే రకానికి చెందిన ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని బాబు ప్రజల్ని భయపెడుతున్నారు. దీనిపై…

ఆంధ్రప్రదేశ్ లో, మరీ ముఖ్యంగా కర్నూలులో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభించిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్-440కే అనే రకానికి చెందిన ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని బాబు ప్రజల్ని భయపెడుతున్నారు. దీనిపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.

రాష్ట్రాన్ని భయపెడుతోంది ఎన్-440కే రకం కాదని.. నారా-420 అనే రకం స్ట్రెయిన్ రాష్ట్రాన్ని భయపెడుతోందన్నారు. ప్రస్తుతం నారా-420 రకం స్ట్రెయిన్ హైదరాబాద్ పారిపోయినా.. దాని ఆనవాళ్లు మాత్రం ఇంకా ఆంధ్రాలో ఉన్నాయంటూ సెటైర్ వేశారు.

“సీసీఎంబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం ఆపడం లేదు. N440K వైరస్ వేరియెంట్ ప్రబలిందంటూ NARA-420 వైరస్ ప్రచారం చేస్తోంది. హైదరాబాద్ పారిపోయినా నారా 420 వైరస్ ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నాయి. ప్రజల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుందీ ఈ జూమ్ భూతం.”

బాబుకు అధికారం ఇస్తే కరోనాను ఖతం చేస్తారంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జోకులు వేశారు విజయసాయి. గతంలో అధికారం ఇస్తే బాబు ఏం చేశారో అంతా చూశారని, ఇంకోసారి అధికారం ఇస్తే ఏపీ గతి అథోగతి అన్నారు.

“చంద్రంకు ఓ వారం అధికారమిస్తే కరోనాను ఖతం చేస్తాడంటూ పచ్చనేతలు డబ్బా కొడుతున్నారు. రేపు కరోనాపై కరాటే అంటారేమో? దోమలపై దండయాత్ర, నీరు – చెట్టు స్కీం అంటూ కోట్లు బొక్కేశారు. రెండు రెయిన్ గన్లు తెచ్చి కరువును ఖతం చేశామన్నారు. ఇవన్నీ చూసే ప్రజలు మిమ్మల్ని పాతాళంలో పాతరేశారు.”

తన హయాంలో వేల కోట్ల రూపాయల నిధుల్ని తన సంబంధీకుల ఆసుపత్రులకు దోచిపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హాస్పిటల్స్ లో పేదలకు బెడ్లు ఇప్పించొచ్చు కదా అంటూ సూటిగా ప్రశ్నించారు విజయసాయి. రోగుల ప్రాణాలు పోతే ప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చని దుర్బుద్ధి తప్ప, సాయం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు.