నాగ్ ‘ఫ్యామిలీ మాన్’

చాన్నాళ్లుగా వార్తల్లో వుంటూ వస్తున్న నాగార్జున వైల్డ్ డాగ్ ట్రయిలర్ వచ్చింది. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటిటికి వెళ్లిపోతుందని వార్తలు వచ్చాయి.…

చాన్నాళ్లుగా వార్తల్లో వుంటూ వస్తున్న నాగార్జున వైల్డ్ డాగ్ ట్రయిలర్ వచ్చింది. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటిటికి వెళ్లిపోతుందని వార్తలు వచ్చాయి. కానీ గతం గత: థియేటర్ లోకే వస్తున్నాం అని నాగ్ ప్రకటించేసారు.

ట్రయిలర్ చూస్తుంటే మాత్రం ఓటిటిలో వెబ్ సిరీస్ చూస్తున్నట్లే అనిపించింది. అలాంటి థీమ్, అవే లోకేషన్లు, పక్కగా సెట్ అయ్యే బ్యాక్ గ్రవుండ్ స్కొర్. అన్నీ కలిపి ఫ్యామిలీ మాన్ లాంటి వెబ్ సిరీస్ ను గుర్తుకు తెచ్చాయి. 

ఆ సంగతి అలా వుంచితే క్వాలిటీ ఆఫ్ వర్క్ సినిమాలో వుందని ట్రయిలర్ స్పష్టం చేస్తోంది.  వెబ్ సిరీస్ ల సంగతి అలా వుంచితే ఆ టైపు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు పెద్ద తెర మీద చూడడానికి ఇష్టపడేవారికి బాగా నచ్చేలా వుంది ట్రయిలర్ చూస్తుంటే.