విశాఖ మేయర్ ఎవరో?

విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన నగరానికి తొలి పౌరుడు ఎవరు అవుతారు అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది. విభజన ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ సర్కార్…

విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన నగరానికి తొలి పౌరుడు ఎవరు అవుతారు అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది. విభజన ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ సర్కార్ పాలనా రాజధానిని చేసింది. దాంతో కొత్త మేయర్ హోదా చాలా కీలకమైనది అన్నది తెలిసిందే.

విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులు ఉన్నాయి. మ్యాక్ ఫిగర్ 50గా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికలలో సరళిని బట్టి చూస్తే అధికార వైసీపీ గెలవడం ఖాయమనే అంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

ఇక ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గడం పట్ల కూడా చర్చ సాగుతోంది. 2007 లో జరిగిన ఎన్నికల్లో 52 శాతం పోలింగ్ జరిగితే ఈసారి 59 శాతం జరిగింది. కానీ భీమిలీ, అనకాపల్లి వంటి మునిసిపాలిటీలు కూడా వచ్చి చేరాయి. దాంతో వాటిని కూడా  కలిపితే గత పోలింగ్ కి ఇప్పటికీ పెద్దగా తేడా లేదని అంటున్నారు.

ఇక తగ్గిన పోలింగ్ వల్ల అధికార పార్టీ మీద వ్యతిరేకత ఏమీ జనాలలో  లేదని తేలుతోందని ఒక విశ్లేషణ ఉంది. మరో వైపు జనసేన పోటీ వల్ల తెలుగుదేశానికి నష్టం కలుగుతుందా అన్న ఆందోళన పసుపు పార్టీలో ఉందిట. 

మొత్తానికి చూస్తే విశాఖ కొత్త మేయర్ వైసీపీ నుంచే ఉంటారన్న దాని మీద దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి వైసీపీ మేయర్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అన్నదే కొత్త చర్చ.

జోగి బ్రదర్స్ ..జాతి రత్నాలు రివ్యూ

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్