మా మూవీలో లిప్ కిస్సులు ఉండవు

సినిమాకు ప్రచారం కల్పించాలంటే ఏదో ఒక వివాదం రేపాలి. లేదంటే బోల్డ్ సన్నివేశాలైనా పెట్టాలి. ఈ రెండూ లేనిదే ప్రచారం జరగడం ఇప్పుడు కష్టంగా మారింది. కానీ సుమంత్ మాత్రం తమ సినిమాలో ఎలాంటి…

సినిమాకు ప్రచారం కల్పించాలంటే ఏదో ఒక వివాదం రేపాలి. లేదంటే బోల్డ్ సన్నివేశాలైనా పెట్టాలి. ఈ రెండూ లేనిదే ప్రచారం జరగడం ఇప్పుడు కష్టంగా మారింది. కానీ సుమంత్ మాత్రం తమ సినిమాలో ఎలాంటి వివాదాలు లేవని, లిప్ కిస్సులు అస్సలు ఉండవని అంటున్నాడు.

“వివాదాలు ప్రచారం వరకు మాత్రమే ఉపయోగపడతాయి. తర్వాత అంతా సినిమాలో కంటెంటే చూస్తారు. ఈమధ్య చాలా సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి. బోల్డ్ కంటెంట్ కూడా వస్తోంది. అవన్నీ జనాల్ని థియేటర్ కు రప్పించడం వరకే. బోల్డ్ కంటెంట్ వచ్చిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయో మీకు(రిపోర్టర్) కూడా తెలుసు కదా.”

ఈనెల 7న విడుదలకానున్న సుబ్రహ్మణ్యపురం సినిమాలో రొమాన్స్ తక్కువ, థ్రిల్ ఎక్కువగా ఉంటుందంటున్నాడు సుమంత్. ఎలాంటి పక్కదారులు తొక్కకుండా, కేవలం కథను నమ్మి నిజాయితీగా ఈ సినిమా చేశామంటున్నాడు సుమంత్.

“కాంట్రవర్సీ రొమాన్స్ చూడరు. అయినా మా సినిమా రొమాంటిక్ మూవీ కాదు. ఇది కాంట్రవర్సీ చేయాల్సిన సినిమా కాదు. మా చేతిలో మంచి ట్రయిలర్ ఉంది. నిజాయితీగా చేశాం. అందుకే వివాదాలు సృష్టించాల్సిన అవసరం లేదు.”

కార్తికేయ సినిమాకు జిరాక్స్ కాపీలా ఉందనే విమర్శపై కూడా సుమంత్ స్పందించాడు. రెండూ దేవుడి గుడి చుట్టూ తిరిగే కథాంశాలే కావడంతో ఆ పోలిక వచ్చిందని, అంతే తప్ప కార్తికేయతో తమ సినిమాకు ఎలాంటి పోలిక లేదంటున్నాడు. తను ఇప్పటివరకు ఈ జానర్ టచ్ చేయలేదు కాబట్టి ఈ సినిమా చేశానంటున్నాడు.

తెలంగాణ ఓటరు నాడి… ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?… చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్