లోకల్‌ ఫైట్‌: వైఎస్‌ జగన్‌ స్వీట్‌ వార్నింగ్‌..

స్వీట్‌ వార్నింగ్‌ మాత్రమే కాదు, ఒకింత ఘాటైన వార్నింగ్‌ కూడా.! స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్‌ తీసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

స్వీట్‌ వార్నింగ్‌ మాత్రమే కాదు, ఒకింత ఘాటైన వార్నింగ్‌ కూడా.! స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్‌ తీసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కాస్తంత సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చేశారు. పార్టీ వాయిస్‌ని బలంగా విన్పించే క్రమంలో కొందరు యాక్టివ్‌గానే వుంటున్నా, కొందరు ముఖ్య నేతలు మాత్రం, పదవులతో పండగ చేసుకుంటున్నారు తప్ప, ప్రజలతో మమేకం కావడంలేదన్న విమర్శ గ్రౌండ్‌ లెవల్‌ నుంచీ వైసీపీలో విన్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందర ఈ అంశంపై వైఎస్‌ జగన్‌ మరింత దృష్టి పెట్టినట్లే కన్పిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల స్థాయిలోనే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాన్ని అందుకోవాలన్నది వైఎస్‌ జగన్‌, మంత్రులకు చేసిన సూచన లాంటి హెచ్చరిక. ‘స్థానిక సంస్థల ఎన్నికల్ని గనుక లైట్‌ తీసుకుంటే పదవులు పోతాయ్‌.. ఏమాత్రం అలసత్వాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు..’ అని వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పడంతో, వైసీపీ వర్గాల్లో కొంత టెన్షన్‌ సుస్పష్టంగా కన్పిస్తోంది.

నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని బలంగా ఢీకొట్టే శక్తి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదు. బీజేపీ, జనసేన పార్టీల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదేమో.! అయినాగానీ, ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వకూడదన్నది ముఖ్యమంత్రి ఆలోచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధిస్తే, అది తమ తొమ్మిది నెలల పాలనకు రిఫరెండవ్‌ుగా మారుతుందని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్లే కన్పిస్తోంది.

నిజమే మరి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వస్తూనే అతి తక్కువ కాలంలో కుప్పలు తెప్పలుగా సంక్షేమ పథకాల్ని అమలు పర్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. అయితే, విపక్షాల యాగీ కారణంగా, ప్రజల్లో ఎంతో కొంత కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అయితే, అది ప్రభుత్వ వ్యతిరేకతగా మారొచ్చనీ, ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలపై మరింత దృష్టిపెట్టాలని మంత్రులకు వైఎస్‌ జగన్‌ సీరియస్‌ టోన్‌లోనే స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారని అనుకోవచ్చు.