సంక్షేమ రాజకీయాలకు పుట్టినిల్లే తమిళనాడు. అలాంటిది ఇప్పుడు సంక్షేమ రాజకీయాలే కీలకం అయినపుడు ఎందుకు ఆ బాట వదిలేస్తుంది? కొత్తగా అధికారం చేపట్టిన సిఎమ్ స్టాలిన్ కూడా ఇదే చేసారు. తొలి అయిదు సంతకాలు కేవలం సంక్షేమపథకాల దిశగానే చేసారు.
రేషన్ కార్డున్న ప్రతి ఇంటికీ రెండు వేలు నగదు రూపంలో అందించబోతున్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్ధినులు ఇక సిటీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. అలాగే ప్రభుత్వ డైరీ పాల ధరను తగ్గించారు.
ఇవన్నీ ఒక ఎత్తు ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్ మెంట్ ను పేదలకు ఉచితం చేయడం మరొక ఎత్తు. అవసరం అయితే ఆసుపత్రులను ప్రభుత్వం కంట్రోల్ లోకి తీసుకుంటామన్నారు సిఎమ్ స్టాలిన్.
ప్రజల సమస్యల తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో గ్రీవెన్సె స్ సెల్స్ ను ప్రారంభిస్తామన్నారు.
మొత్తానికి జయలలిత కనుమరుగయ్యాక ఇలా ప్రజలకు నేరుగా ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం అరుదు అయింది తమిళనాట. మళ్లీ అది స్టాలిన్ శకంతో ప్రారంభమైంది.