అక్కడ ఐఏఏస్ లకూ కరోనా?

కరోనా మహమ్మారికి వారూ వీరూ అన్న భేదం లేదు. ఎవరినైనా తన వైపు లాగేసుకుంటుంటుంది. కరోనా మీద పోరాడేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేస్తున్న ఐఏఎస్ లకు కూడా కరోనా బాధలు తప్పడంలేదు.…

కరోనా మహమ్మారికి వారూ వీరూ అన్న భేదం లేదు. ఎవరినైనా తన వైపు లాగేసుకుంటుంటుంది. కరోనా మీద పోరాడేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేస్తున్న ఐఏఎస్ లకు కూడా కరోనా బాధలు తప్పడంలేదు.

విశాఖ మెగా సిటీలో ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురు ఐఏఎస్ అధికారులు కరోనా బారిన పడ్డారు. జిల్లా కలెక్టర్ వినయచంద్ కరోనా లక్షణాలతో హోం ఐసోలేషన్ లోనే ఉంటే ముగ్గురు జాయింట్ కలెక్టర్లు వేణుగోపాలరెడ్డి, అరుణ్ బాబు, ఆర్ గోవిందరావు సైతం కరోనాతో ఇంట్లో ఉండాల్సి వస్తోంది.

ఇక జీవీఎంసీ కమిషనర్ జి సృజన కూడా కరోనాతో కొన్ని రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. అదే విధంగా వీఎమ్మార్డీయే సెక్రటరీ గణేష్ కుమార్, డీయార్వో ప్రసాద్, ఆర్డీవో పి కిషోర్ బాబు కూడా కరోనా తో ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి చూస్తే జిల్లా యంత్రాంగంలో చాలా మంది అధికారులు కూడా కరోనాతోనే సతమతమవుతున్నారు.

అయితే విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన తమ ఇంటి నుంచే సమీక్షలు నిర్వహిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నత అధికారులు కోరుతున్నారు.