కేటీఆర్ అన్నంత పని చేస్తే..?

తమలపాకుతో నువ్వు ఒకటి అంటే, తలుపుచెక్కతో నేను రెండు అంటా అన్నదట వెనకటికి ఓ మహా తల్లి. అలాగే..''నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..''అన్న వ్యవహారమూ మనకు తెలిసిందే. ఇప్పుడు తెరాస యువరాజు…

తమలపాకుతో నువ్వు ఒకటి అంటే, తలుపుచెక్కతో నేను రెండు అంటా అన్నదట వెనకటికి ఓ మహా తల్లి. అలాగే..''నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..''అన్న వ్యవహారమూ మనకు తెలిసిందే. ఇప్పుడు తెరాస యువరాజు కేటీఆర్ ఇలాగే అంటున్నారు. చంద్రబాబు వచ్చి ఇక్కడ మా రాజకీయాల్లో వెలు పెట్డడం కాదు, భవిష్యత్ లో తాము కూడా ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతాం అంటున్నారు. 

ఆ, ఇంతోటి కేటీఆర్ వచ్చి ఇక్కడ పొడిచేది ఏముంది? అని బాబు అనుచరణ గణమో, సామాజిక గణమో అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఒక్క పాయింట్ మరిచిపోతున్నారు. రాక రాక వెలమ సామాజిక వర్గానికి అధికార పగ్గాలు వచ్చాయి తెలంగాణలో. ఇదే వెలమ సామాజిక వర్గం ఆంధ్రలో కూడా తక్కువగా ఏమీ లేదు. ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వెలమల సంఖ్య గణనీయంగా వుంది. 

బాబుగారి ప్రతాపం కారణంగా తమ వారి చేతికి వచ్చిన ప్రభుత్వం పోయింది అన్న భావన వెలమల్లో కలిగితే..? లేదూ కేసిఆర్ నో,. కేటీఆర్ నో ఆంధ్రలో వెలమల ప్రాబల్యం వున్న ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నిలిపితే..? కాదూ, కేటీఆర్ నో, కేసిఆర్ నో ఆంధ్రకు వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తేనో? కొంతయినా ప్రభావం వుండకుండా పోతుందా? 

అదే కనుక కేసిఆర్ దో, కేటీఆర్ తో అదృష్టం కలిసివచ్చి, తెలంగాణలో అధికారం చేజిక్కింది అనుకుందాం? అప్పుడు కచ్చితంగా ఆంధ్రకు వచ్చి బాబుపై పోరు షురూ చేయడం పక్కా కావచ్చు. ఏమైనా తెలంగాణ ఎన్నికలు ఆంధ్ర వెలమల్లో అసంతృప్తిని పెంచుతున్నాయన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.