రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. దీనికి చిన్న లవ్ ట్రాక్ ను యాడ్ చేసినట్లు కనిపిస్తోంది ఈ రోజు విడుదల చేసిన టీజర్ ను చూస్తుంటే. టీజర్ కట్ లో పెద్దగా సీరియస్ నెస్ ను దృష్టిలో పెట్టుకోలేదు. జస్ట్ జోనర్ ను ప్రెజెంట్ చేయాలనుకున్నట్లు కనిపిస్తోంది.
అల్లరి నరేష్ సినిమా మాదిరిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ప్రెజెంట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే రాజ్ తరుణ్ హీరో కాబట్టి, కాస్త అప్ డేట్ వెర్షన్ లా వుంది. టీజర్ లో రెండు మూడు పంచ్ లు వేసే ప్రయత్నం చేసారు దర్శకుడు విజయ్ కుమార్. 'బాధకు బ్రాండ్ లతో పని లేదు', 'కత్తకి బట్టలు కట్టి పంపు' లాంటి చిన్నపాటి మెరుపులు మెరిసాయి. 'ఏంటి సూపరు..బెబ్బె.అక్కడేం (జరగ) లేదు లాంటి టీజర్ లో వేయకూడని డైలాగు కూడా వేయడం విశేషం.
అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ టీజర్ కు తగినట్లు యాప్ట్ గా వుంది. సమ్మర్ స్టార్టింగ్ లో వస్తున్న ఈ సినిమా సినిమా పక్కాగా ఫ్యామిలీలను ఎంటర్ టైన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.