ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డికి నటుడు సిద్ధార్థ్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. లేదురా, కదరా అంటూ ఘాటు వ్యాఖ్య లతో సంబోధించారు. అసలేం జరిగిందంటే…
గత కొన్ని రోజులుగా బీజేపీ వర్సెస్ సిద్ధార్థ్ అనే రీతిలో సోషల్ మీడియాలో డైలాగ్ వార్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్యపై సిద్ధార్థ్ ఎటాక్ చేశారు. బెంగళూరులోని పలు ఆస్పత్రుల్లో చాలా బెడ్స్ అందుబాటులో ఉన్నప్ప టికీ.. వాటిని తేజస్వి సూర్య బ్లాక్ చేయించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని సిద్ధార్థ్ తనదైన స్టైల్లో తేజస్వికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
“యంగ్ ఎంపీ తేజస్వి సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి. టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కంటే దశాబ్దకాలపు ముందు వ్యక్తి. ఈ ట్వీట్ ను సేవ్ చేయండి” అంటూ ట్వీట్ చేశాడు. ముంబయ్ బాంబు పేలుళ్ల సూత్రధారి కసబ్‌తో తమ ఎంపీని పోల్చడంపై బీజేపీ కస్సు మంది. సిద్ధార్థ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, దూకుడు తగ్గించుకోవాలని బీజేపీ నేతలు హితవు పలికారు.
ఈ పరంపరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆ వివాదంలో తలదూర్చారు. సిద్ధార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం నిధులు సమకూర్చుతున్నాడంటూ ట్వీట్ చేశారు. దీంతో సిద్ధార్థ్ మరోసారి ట్విటర్ వేదికగా విష్ణుపై విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలను ప్రయోగించారు. సిద్ధార్థ్ హాట్ ట్వీట్ ఎలా సాగిందంటే…
“లేదు రా. అతను (దావుద్) నా టీడీఎస్ ( టాక్స్ డీ డిడక్ట్ డు సోర్స్) చెల్లించడానికి సిద్ధంగా లేడు. పన్ను చెల్లించే చిత్తశుద్ధి గల పౌరుడిని కదరా విష్ణు. వెళ్ళి పడుకో. బిజెపి రాష్ట్ర కార్యదర్శి అంటా. సిగ్గు ఉండాలి” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.