బయోపిక్ సభలో ఫ్యామిలీ సెంటిమెంట్?

నందమూరి తారకరామారావు జీవిత గాథ ఆధారంగా తయారవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 16న తిరుపతి లో జరగబోతోంది. అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. సహజంగానే ఈ ఫంక్షన్ కు చంద్రబాబు…

నందమూరి తారకరామారావు జీవిత గాథ ఆధారంగా తయారవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 16న తిరుపతి లో జరగబోతోంది. అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. సహజంగానే ఈ ఫంక్షన్ కు చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్ గా వస్తారని అనుకోవడం సహజం. 

అయితే ఈసారి బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతకు మించి స్పెషల్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్లు ఈ ఫంక్షన్ కు స్పెషల్ అట్రాక్షన్ గా వుండే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలయ్య సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొడుకులు అందరూ కలిసి ట్రయిలర్ ను, కూతుళ్లు అందరూ కలిసి అడియో సిడీ ని విడుదల చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కూతుళ్లు, అల్లుళ్లు అంటే దగ్గుబాటి పురంధ్రీశ్వరి, వెంకటేశ్వరరావు కూడా రావాల్సి వుంటుంది. మరి అది చంద్రబాబుకు ఇష్టం వుంటుందో, వుండదో? మరి బాలయ్య అందరినీ ఎలా కన్విన్స్ ఛేసి ఈ ఫంక్షన్ కు తీసుకువస్తారో చూడాలి మరి.