టాక్సీవాలా. విడుదలకు వారం ముందువరకు పెద్దగా బజ్ లేని సినిమా. విడుదలకు నెలలు ముందుగానే లీక్ అయిన సినిమా. అలాంటి సినిమా విడుదల అవుతూనే భలే క్రేజ్ తెచ్చుకుంది. కానీ మళ్లీ అంతలోనే అది చల్లారి, కలెక్షన్లు నెమ్మదించాయి. కానీ మళ్లీ అంతలోనే పైకి లేచింది. అలా పెద్దగా హడావుడి, హల్ చల్ లేకుండానే స్మూత్ గా రన్ అవుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్ కు చేరుకుంది.
ఆ సినిమాకు పెట్టిన ఖర్చుతో చూసుకుంటే ఇది చాలా ఘన విజయమే. ఓవర్ సీస్, రెస్టాఫ్ ఇండియా, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ అమ్మేయగా, ప్రింట్ అండ్ పబ్లిసిటతో కలిపి అయిదుకోట్ల రిస్క్ తో ఓన్ రిలీజ్ చేసారు ఈ సినిమా యువి అండ్ గీతా కలిపి. ఇప్పుడు దానికి మూడింతలు షేర్ సంపాదించింది.
బహుశా రోబో వస్తుండడం వల్ల ఇంక రన్ వుండకపోవచ్చు. వున్నా రెంటల్ కు సరిపోవచ్చు. అక్కడా అక్కడా షేరింగ్ మీద ఆడిస్తున్నారు కాబట్టి, అలా అలా ఎంతో కొంత వస్తూనే వుంటుంది. మొత్తం మీద గీతా2-యువికి మరో మంచి లాభం ఇచ్చిన సినిమాగా టాక్సీవాలా మిగిలిపోతుంది.
కలెక్షన్ల వివరాలు
నైజాం……………………..7.50 కోట్లు
సీడెడ్……………………..1.60
ఉత్తరాంధ్ర……………….1.80
ఈస్ట్…………………………0.90
వెస్ట్………………………….0.76
కృష్ణా………………………..1.10
గుంటూరు…………………1.20
నెల్లూరు…………………….0.45