బయోపిక్ పాట వస్తోంది

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటి వరకు లుక్కులు, లీకులతోనే సరిపెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి, అసలు ప్రచారంలోకి దిగబోతున్నారు. సినిమాకు సంబంధించి తొలి పాటను విడుదల చేయబోతున్నారు. సినిమాలో ఎన్టీఆర్ 'హీరోచిత'…

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటి వరకు లుక్కులు, లీకులతోనే సరిపెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి, అసలు ప్రచారంలోకి దిగబోతున్నారు. సినిమాకు సంబంధించి తొలి పాటను విడుదల చేయబోతున్నారు. సినిమాలో ఎన్టీఆర్ 'హీరోచిత' ఇంట్రడ్యూసింగ్ సాంగ్ టైపులో ఓ పాట వుంది. ఆ పాటను ముందుగా విడుదల చేయబోతున్నారు.

బయోపిక్ కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అడియో రైట్స్ ను ఇప్పటికే రెండు కోట్లకు పైగా మొత్తానికి లహరి సంస్థకు విక్రయించారు. అందువల్ల ఇప్పటి నుంచి ఒక్కో పాట విడుదల చేసి, హడావుడి చేస్తే తప్ప, ఆ సంస్థకు డబ్బులు వెనక్కు రావు. పైగా సినిమా విడుదల ఇంక నెలన్నర రోజులకు వచ్చేసింది. 

అందువల్ల ఈ నెల రెండు లేదా మూడు తేదీల్లో పాటను విడుదల చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాటల విడుదల చేయడం మొదలు పెడితే సినిమాకు బజ్ మరింత పెరిగే అవకాశం వుంది. పైగా పాట బాగుంటే తెలంగాణ ఎన్నికల తెలుగుదేశం ప్రచారంలో హోరెత్తించుకోవచ్చు కూడా. 

వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి, ఇందూరి విష్ణులతో కలిసి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 9న తొలిభాగం విడుదలవుతుంది.