బోయపాటి ఎక్కడుంటే హీరోయిన్ క్యాథరీన్ అక్కడుండాల్సిందే. బయట ఏం జరుగుతోందనే విషయాన్ని పక్కనపెడితే, తెరపై మాత్రం బోయపాటి సినిమాల్లో క్యాథరీన్ కనిపించాల్సిందే. అంతలా వీళ్లిద్దరి మధ్య 'సినీ' బంధం, ఫెవికాల్ కంటే బలంగా పెనవేసుకుంది.
బోయపాటి తీసిన సరైనోడు సినిమాలో క్యాథరీన్ మెరిసింది. ఆ మూవీలో ఆమెకు కాస్త గట్టి పాత్రే లభించింది. ఆ సినిమాతో ఒకరికొకరు పరిచయమైన బోయపాటి-క్యాథరీన్ అప్పట్నుంచి తమ సినీప్రయాణాన్ని జాయింట్ గా కొనసాగిస్తూనే ఉన్నారు.
సరైనోడు తర్వాత జయజానకి నాయక సినిమా చేశాడు బోయపాటి. ఈ సినిమాలో కూడా క్యాథరీన్ ను రిపీట్ చేశాడు. హీరోయిన్ గా ఛాన్స్ అయితే ఇవ్వలేకపోయాడు కానీ, ఓ ఐటెంసాంగ్ లో క్యాథరీన్ ను చూపించుకోగలిగాడు.
ఇప్పుడీ దర్శకుడు వినయ విధేయ రామ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కూడా హీరోయిన్ గా క్యాథరీన్ ను తీసుకోలేకపోయాడు. కానీ మరోసారి ఐటెంసాంగ్ లో ఆమెను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అవును.. వినయ విధేయ రామ ఐటెంసాంగ్ లో క్యాథరీన్ మెరిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ మేరకు తెరవెనక ఏర్పాట్లు జరిగిపోయాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఐటెంసాంగ్ కోసం ఇలియానాను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసిందని ఆమెను తప్పించారట. తర్వాత రకుల్, కాజల్ పేర్లు కూడా బాగానే వినిపించాయి.
కానీ ఫైనల్ గా తన మనసులో ఎప్పట్నుంచో అనుకుంటున్న క్యాథరీన్ నే ఫిక్స్ చేశాడు బోయపాటి. అలా వరుసగా మూడోసారి ఈ ముద్దుగుమ్మకు తన మూవీలో చోటిచ్చాడు.
ఎన్టీఆర్ కు భవిష్యత్ లేకుండా చేసే ప్లాన్… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్