లిప్ కిస్ లీక్ చేసినా క్రేజ్ రాలేదు

మొన్నటివరకు శంకర్ ను ఆడిపోసుకున్నాడు. 2.0 సినిమాపై ఎన్నో సెటైర్లు వేశాడు. అలా తను సమర్పిస్తున్న భైరవగీత సినిమాకు అటెన్షన్ రాబట్టాలని అనుకున్నాడు వర్మ. కానీ 2.0కు పబ్లిసిటీ పెరిగింది తప్ప, భైరవగీతను పట్టించుకున్న…

మొన్నటివరకు శంకర్ ను ఆడిపోసుకున్నాడు. 2.0 సినిమాపై ఎన్నో సెటైర్లు వేశాడు. అలా తను సమర్పిస్తున్న భైరవగీత సినిమాకు అటెన్షన్ రాబట్టాలని అనుకున్నాడు వర్మ. కానీ 2.0కు పబ్లిసిటీ పెరిగింది తప్ప, భైరవగీతను పట్టించుకున్న నాధుడులేడు. ఇప్పుడు మరో రకమైన ప్రమోషన్ షురూ చేశాడు ఆర్జీవీ. తన సినిమా నుంచి ఓ రొమాంటిక్ లిప్ కిస్ లీక్ అయిందంటూ హడావుడి మొదలుపెట్టాడు.

నిజమే వర్మ చెబుతున్నట్టు భైరవగీత సినిమాకు సంబంధించి ఓ హాట్ క్లిప్ లీక్ అయింది. క్వారీలో హీరోయిన్ ను హీరో గట్టిగా తనవైపు లాక్కుంటాడు. అంతే వేగంతో హీరోయిన్ పెదాల్ని అందుకుంటాడు. ఈ లిప్ కిస్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది.

ఇంతవరకు ఓకే కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అలా లీక్ అయినా వీడియో కూడా వైరల్ అవ్వలేదు. భైరవగీతపై ఆడియన్స్ కు ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. మరోవైపు ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ లీక్ అయితే ఎలా అంటూ వర్మ బీద అరుపులు మొదలుపెట్టాడు.

రిలీజ్ కు ముందు సినిమా లీక్ అయితే, రిజల్ట్ సంగతి పక్కనపెడితే పబ్లిసిటీ మాత్రం దండిగా వస్తుంది. అందుకే వర్మ ఇలా చీప్ గా తనే స్వయంగా భైరవగీత క్లిప్ ను లీక్ చేయించాడనే టాక్ నడుస్తోంది. లీక్ అయిన క్లిప్ సంగతి పక్కనపెడితే, వర్మనే ఇలా స్వయంగా లీక్ చేయించాడనే వార్త మాత్రం వైరల్ అవుతోంది.