కొన్ని సినిమాలకు రిస్క్ అవసరం

చిరకాలంగా రజనీకాంత్ సినిమాలు పెద్దగా ఫేర్ చేయడంలేదు. చేసింది లేదు. అలాంటి టైమ్ లో దాదాపు అన్నీకలిపి 80కోట్ల మొత్తానికి సిద్దపడి తెలుగు కోసం కొన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ ప్రసాద్. ఇది రిస్క్…

చిరకాలంగా రజనీకాంత్ సినిమాలు పెద్దగా ఫేర్ చేయడంలేదు. చేసింది లేదు. అలాంటి టైమ్ లో దాదాపు అన్నీకలిపి 80కోట్ల మొత్తానికి సిద్దపడి తెలుగు కోసం కొన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ ప్రసాద్. ఇది రిస్క్ అనిపించడం లేదా? అని అడిగితే..

''..సినిమానే రిస్క్ వ్యాపారం. మనం ఏది కచ్చితంగా హిట్ అనుకుంటామో, అది ఫ్లాప్ అయిన సందర్భాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. రోబో సినిమాను ఎవ్వరూ కొనలేదు. ఎవరో ఆఖరికి కొన్నారు. అప్పుడేమయింది? ఇక్కడ ఇది పక్కా హిట్ అని చెప్పలేం. ఇది పక్కా ఫ్లాప్ అని చెప్పలేం. అలా చెప్పగలిగితే, అందరూ లాభాలే చేసుకుంటారు కదా?

ఆ సంగతి అలా వుంచితే, రోబో 2.0 లాంటి సినిమాల విషయంలో లాభ నష్టాల కన్నా, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అన్నది ముఖ్యం. శంకర్ జనాలకు అంతగా నచ్చని ఐ సినిమా తీసినా, మంచి కలెక్షన్లు నమోదు చేసింది. అందువల్ల రిస్క్ అంటారా రిస్క్ నే. కాదు, ఫ్యాషన్ అంటారా? అదే అనుకోవాలి…''

ఎన్ని స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు అని అడిగితే…'' దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి థియేటర్ వాళ్లు ఈ సినిమాను అడుగుతున్నారు. అయితే అలా అని అన్నిచోట్లా వేయలేం కదా? దాదాపు 80శాతం థియేటర్లలో ఈ గురు, శుక్ర, శని, ఆదివారాలు కచ్చితంగా రోబో సినిమానే వుంటుంది. ప్రసాద్ ఐమాక్స్ లో తొలిరోజు దాదాపు 33 షోలు పడుతున్నాయి… ఇంకా చాలాచోట్ల తొలిరోజు ఎక్కువ షోలు పడే అవకాశం వుంది..'' అన్నారు.

రోబో 2.0 సినిమా మీరు చూసారా? మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అంటే.. ''ఇప్పటి దాకా శంకర్ మినహా మరేవరు సినిమా చూడలేదు. కానీ వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటంటే, సినిమా విజువల్ వండర్ గా వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఇండియన్ అవెంజర్స్ మాదిరిగా గ్రాండీగా వుంటుంది. సెకండాఫ్ మొత్తం ఉత్కంఠతో, కళ్ల ముందు జరుగుతున్నదాన్ని కళ్లు అప్పగించి చూసేలా వుంటుంది..'' అన్నారు.

ఈ సినిమాను కొన్నది మీరు ఒక్కరేనా, దిల్ రాజు, వంశీ కూడానా? అని అడిగితే..'' ఇక్కడ భాగస్వామ్యం, వ్యాపారం కాదు. రోబో 2.0 అనే సినిమాను మేము ముగ్గురం కలిసి, ఒకరికి ఒకరు సాయం, సహకారం అందించుకుంటూ విడుదల చేస్తున్నాం' అన్నారు ఎన్వీప్రసాద్.

కల్యాణ్ రామ్ ఇంతకీ ఎటువైపు..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్