రాబోయే సంక్రాంతికి మేమంటే మేము అంటూ పోటీ పడుతూ ప్రకటనలు ఇచ్చేసారు. అయితే ఎవరు వస్తారు.. ఎవరు రారు అన్నది క్వశ్చను. ఇప్పటికే పూర్తయిపోయిన హనుమాన్, ఈగిల్ సినిమాలు పక్కాగా వస్తాయని వినిపిస్తోంది.
ఇక మిగిలిన సినిమాలు రెండు. మహేష్-త్రివిక్రమ్ గుంటూరు కారం, విజయ్ దేవరకొండ-పరుశురామ్ ల ‘ఫ్యామిలీ స్టార్’. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటే వస్తుందా? రెండూ వస్తాయా అన్న అనుమానాలుు వుండనే వున్నాయి.
విజయ్ దేవరకొండ సినిమా ఇప్పటికి ముఫై రోజులు షూట్ పూర్తి చేసుకుంది. వచ్చేనెలలో 30 రోజులకు పైగా అమెరికా షెడ్యూలు వుంది. అక్టోబర్ నెలాఖరకు షూట్ పార్ట్ అయిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ సినిమా షెడ్యూలు సరైనది ఒక్కటే జరిగింది. ఈ నెల 12 నుంచి మొదలైతే కనుక సంక్రాంతికిి రావడం సాధ్యం అవుతుంది. లేదూ, ఈ నెలలో షూట్ జరగకపోతే మాత్రం సంక్రాంతికి. రావడం కష్టం అవుతుంది.
కానీ సమస్య మరొకటి కూడా వుంది. నిజంగా కనుక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమా కనుక సంక్రాంతికే రావాలి అనుకుంటే పెద్ద సమస్యే అవుతుంది. సంక్రాంతికి రెండు లేదా మూడు సినిమాల వరకు చాన్స్ వుంటుంది.
అలాంటిది ఈగిల్, హనుమాన్, గుంటూరు కారం, ఫ్యామిలీస్టార్, ఉస్తాద్ అంటే కనీసం రెండు సినిమాలు వెనక్కు తగ్గాల్సి వుంటుంది. ఏది తగ్గుతుంది అన్నది ఈ నెల దాటితో క్లారిటీ వచ్చేస్తుంది.