కొత్త చంద్రముఖి లుక్ చూశారా?

రజనీకాంత్, నయనతార, జ్యోతిక నటించిన ‘చంద్రముఖి’ సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సౌత్ లో ప్రభంజనం సృష్టించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ…

రజనీకాంత్, నయనతార, జ్యోతిక నటించిన ‘చంద్రముఖి’ సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సౌత్ లో ప్రభంజనం సృష్టించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. పేరు చంద్రముఖి-2. కాకపోతే చాలా మార్పులు జరిగాయి.

చంద్రముఖి-2లో రజనీకాంత్ హీరో కాదు. అతడి స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. రజనీకాంత్ ఆశీస్సులు తీసుకొని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆవేశాన్ని చల్లార్చి, ఈ పాత్రలోకి ప్రవేశించాడు లారెన్స్. అతడికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఈమధ్య రిలీజైంది.

ఇక చంద్రముఖి పాత్రలో జ్యోతిక స్థానంలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈరోజు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. “చంద్రముఖి 2” నుంచి రిలీజైన కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ బాగుంది. చూడ్డానికి సింపుల్ గా కనిపిస్తోంది, కానీ లోతుగా పరిశీలిస్తే ఈ లుక్ లో భారీతనం తెలుస్తోంది.

హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కోసం ఈసారి మరో కొత్త పాయింట్ ను ఎంచుకున్నాడట దర్శకుడు. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ పదేపదే చెబుతోంది. దర్శకుడు పి.వాసుకు ఇది 65వ సినిమా. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో రాధిక, వడివేలు, లక్ష్మీ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.