డబ్బు, మద్యం పంచితే జైలుకే

ఈ వ్యవస్థలో మార్పు రావాలి. అవినీతి పూర్తిగా అంతమవ్వాలి. పారదర్శకత పెరగాలి. ఎన్నికల ప్రచార సమయంలో, పాదయాత్రలో జగన్ పదేపదే చెబుతూ వస్తున్న మాటలివి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే మాటలకు…

ఈ వ్యవస్థలో మార్పు రావాలి. అవినీతి పూర్తిగా అంతమవ్వాలి. పారదర్శకత పెరగాలి. ఎన్నికల ప్రచార సమయంలో, పాదయాత్రలో జగన్ పదేపదే చెబుతూ వస్తున్న మాటలివి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే మాటలకు కట్టుబడి ఉన్నారు జగన్. మరీ ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే అసలైన మార్పునకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.

“పంచాయతీ రాజ్ కు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేశాం. వ్యవస్థ నుంచి అవినీతిని తీసిపారేస్తాం. ఎన్నికల ప్రక్రియ నుంచి మద్యం-డబ్బు పంచడాన్ని పూర్తిగా తీసేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. దీని ద్వారా ప్రతి పోలీస్ కు అధికారం ఇస్తున్నాం. ఎవరైనా మద్యం, డబ్బు పంపినట్టు తెలిస్తే అక్కడికక్కడే అరెస్ట్ చేస్తాం. ఎన్నికలు అయిన తర్వాత ప్రూవ్ అయితే అతడ్ని అనర్హుడిగా చేస్తాం. అంతేకాదు, 3 ఏళ్ల పాటు జైలుకు కూడా పంపిస్తాం.”

ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి బాగా డబ్బు సంపాదించి, ఎన్నికల టైమ్ కు సడెన్ గా వచ్చి డబ్బులు పంచి గెలిచే పరిస్థితి మారాలన్నారు జగన్.  అప్పటివరకు ప్రజల మధ్య ఉంటూ, ప్రజల బాగోగులు చూసే వ్యక్తి గెలిచే పరిస్థితులు రావాలన్నారు. అందుకే కఠినమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు సీఎం.

“డబ్బులు, మద్యం పంచారనే వార్త ఒక్క గ్రామం నుంచి కూడా రాకూడదు. ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నాను. ఈ రెండూ అరికట్టడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలనుకుంటున్నాను. జనంలో ఉన్న వ్యక్తి మాత్రమే గెలవాలనుకుంటున్నాను.”

కోర్టు ఆదేశాల మేరకు  ఈ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు జగన్. దానికి సంబంధించి రేపు తేదీలు వెలువడే అవకాశం ఉందని స్పష్టంచేశారు.

సూపర్ స్టార్ అనేది బిరుదు మాత్రమే కాదు  భాధ్య‌త