త‌మిళ బ‌రిలో అధినేత కుమారుడు

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు బ‌రిలో దిగ‌నున్నాడు. డీఎంకే త‌న మొద‌టి జాబితాను శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. Advertisement ఈ జాబితాలో ప్ర‌తిప‌క్ష నేత‌, డీఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ కుమారుడు…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు బ‌రిలో దిగ‌నున్నాడు. డీఎంకే త‌న మొద‌టి జాబితాను శుక్ర‌వారం ప్ర‌క‌టించింది.

ఈ జాబితాలో ప్ర‌తిప‌క్ష నేత‌, డీఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ చెపాక్ నియోజ‌క వ‌ర్గం నుంచి టికెట్ ద‌క్కించుకున్నాడు. అలాగే కొల‌తూర్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్టాలిన్ పోటీ చేయ‌నున్నాడు. ఇటీవ‌ల టికెట్ల కేటాయింపులో భాగంగా సంప్ర‌దాయంగా డీఎంకే అగ్ర‌నేత‌లు అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా యువ‌నేత ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యాడు.

అయితే ఉద‌య‌నిధి స్టాలిన్‌ను పార్టీ ప‌క్క‌న పెట్టింద‌నే ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి. కానీ అభ్య‌ర్థుల తొలి జాబితాలో స్టాలిన్ కుమారుడు చోటు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. తొలి జాబితాను స్వ‌యంగా స్టాలిన్ ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను కొల‌తూర్ నుంచి పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

అలాగే ముఖ్య‌మంత్రి ఇ పళనిస్వామి  ప్రత్యర్థిగా సంపత్ కుమార్ బరిలోకి దిగుతున్నాడ‌న్నాడు. ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి బరిలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు ప్రత్యర్థిగా తంగా తమిళ సెల్వన్ బరిలోకి దిగుతున్న‌ట్టు స్టాలిన్ తెలిపాడు.  

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జాతి రత్నాలు మూవీ పబ్లిక్ టాక్