బన్నీ క్యాంప్ లో చిరకాలం వుండి, కథ సరిగ్గా సెట్ కాక బయటకు వచ్చి, నానితో సినిమా మీద వర్క్ స్టార్ట్ చేసారు విక్రమ్ కే కుమార్. మంచి దర్శకుడు. కానీ ఏం ఫలితం కథ సెట్ కావడంలేదు. అదే బన్నీ సినిమాతో సమస్య. ఇలాంటి టైమ్ లో గీతా నుంచి విక్రమ్ కు భలే ఆఫర్ వచ్చింది.
రొటీన్ కోర్స్ ల్లో వింటున్న కథల్లో ఓ కథ బన్నీకి భలేగా నచ్చింది. ఆ కథ చెప్పింది ఓ తమిళ రచయిత. ఇప్పుడు ఈ కథను విక్రమ్ కుమార్ ను పిలిపించి వినిపించారు. వేరేవాళ్ల కథతో తను సినిమా చేయడమా? అన్న చిన్న ఇగో ప్లస్ మీమాంసతో వున్నాడు విక్రమ్ కుమార్ అని వినికిడి.
కానీ బన్నీ క్యాంప్ నచ్చచెప్పడంతో ఆల్ మోస్ట్ ఓకె అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పుడుకాదు. త్రివిక్రమ్ తో సినిమా అయిన తరువాత వుంటుంది. ఈలోగా విక్రమ్ బయట ఓ సినిమా చేసి వస్తారేమో? ఆ విధంగా విక్రమ్ కుమార్ -బన్నీ సినిమా సెట్ అవుతుంది. గీతా అడ్వాన్స్ తీరుతుంది.
జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్