ఆనంద్, హ్యాపీడేస్, చందమామ, లీడర్ ఇలా తన సినిమాల్లో ఎక్కువగా ఎవరో ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయడం, కొత్తవాళ్లకు ఎక్కువగా చాన్స్ ఇవ్వడం అన్నది దర్శకుడు శేఖర్ కమ్ములకు అలవాటు. పైగా అందమైన అమ్మాయిలను హీరోయిన్లను చేయడమే కాదు, వాళ్ల చేత పెర్ ఫార్మ్ చేయించడం కూడా అతనికి వచ్చిన విద్య. ఫిదా సినిమా కేవలం సాయిపల్లవి నటనతోనే ఆడింది.
లేటెస్ట్ గా ఏషియన్ సునీల్ నిర్మాతగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. డ్యాన్స్ లు ఎక్కువగా వుండి, నృత్యం కీలకమైన కథ ఇది. ఈ సినిమాకోసం ఓ కొత్త కుర్రాడిని హీరోగా తీసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసారన్నది. విజయవాడకు చెందిన ఓ డ్యాన్సర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
హీరో, హీరోయిన్ల పేర్లు, ఫొటోలు వీలయినంత గోప్యంగా వుంచే ప్రయత్నం చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఒకేసారి అనౌన్స్ చేయాలన్నది ఆలోచన. ఓ మాంచి సెట్ రెడీ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ రెండోవారంలో మొదలుపెడతారు.
జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్