గత కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న సినిమా ఆచార్య. మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఇది. ఏనాటి నుంచో వార్తల్లో, ఆఫై సెట్ మీద వుంటూ వస్తోంది. ఈ ఏడాది విడుదల అవుతుంది అనుకుంటే ఆర్ఆర్ఆర్ రూపంలో అడ్డంకి వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో, ఆర్ఆర్ఆర్ కన్నా ముందుగా విడుదల కావడానికి వీల్లేదు అనే పరిస్థితి వుందని వార్తలు వచ్చాయి.
అలాంటపుడే దర్శకుడు కొరటాల శివ కొత్త ఎత్తు వేసారు. మహేష్ ను రామ్ చరణ్ చేయబోయే పాత్రకు తీసుకోవాలని ఆయన అనుకున్నారని, ఆ మేరకు మహేష్ ఓకె అన్నారని వార్తలు వినవచ్చాయి. ఈ వార్తలను ఎవ్వరూ ఖండించలేదు. మహేష్ లాంటి స్టార్ వచ్చి, మెగాస్టార్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారు అనే వార్త బయటకు వచ్చిన తరువాత యూనిట్ మౌనంగా వుందీ అంటే ఏమని అర్థం చేసుకోవాలి?
అలాంటిది ఏమీ లేదు అని ఖండించాల్సి వుంది. కానీ అలా జరగలేదు. దాంతో మహేష్-మెగాస్టార్ కాంబినేషన్ పక్కా అనే అనుకుంటున్నారు అంతా. ఇదే టైమ్ లో మరో వార్త కూడా వినవచ్చింది. మెగాస్టార్ ను ఇబ్బంది పెట్టడం ఎందుకు, చరణ్ తోనే చేసుకోండి. ఆగస్టులో విడుదల కూడా చేసుకోండి అని ఆర్ఆర్ఆర్ డైరక్టర్ రాజమౌళి చెప్పేసారనే వార్తలు వినవచ్చాయి.
కానీ ఈ రోజు లేటెస్ట్ డెవలప్ మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ కాకుండా మళ్లీ రామ్ చరణ్ నే తండ్రితో కలిసి నటిస్తారని, ఈ మేరకు చిరంజీవి స్వయంగా నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. అంతే కాదు, సినిమాను ఈ ఏడాది కాకుండా 2021 మార్చిలో విడుదల చేయాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ యూనిట్ వర్గాలు మాత్రం ఈఏడాది ఆగస్టు లేదా అక్టోబర్ లో విడుదల చేస్తామని అంటున్నాయి. మరోపక్క 2021 మార్చి లో విడుదల అని విశ్వసనీయ వర్గాల బోగట్టా.