సీన్ ‘సితార’యేనా?

వరుసగా మంచి సినిమాలు పడుతుంటే, హారిక హాసిని, సితార సంస్థలకు కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారిపోతోందేమో?  నానితో చేయబోయే 'శ్యామ్ సింగ రాయ్' ప్రాజెక్టు మీద ఇలాంటి కామెంట్ లే ఇండస్ట్రీలో…

వరుసగా మంచి సినిమాలు పడుతుంటే, హారిక హాసిని, సితార సంస్థలకు కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారిపోతోందేమో?  నానితో చేయబోయే 'శ్యామ్ సింగ రాయ్' ప్రాజెక్టు మీద ఇలాంటి కామెంట్ లే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అనౌన్స్ చేయడమే ఏకంగా రిలీజ్ డేట్ తో ప్రకటించేసారు. హీరో నాని ప్రస్తుతం టక్ జగదీష్ చేస్తున్నారు. త్వరగానే ఈ ప్రాజెక్టు మీదకు వస్తారు. అందులో సందేహం లేదు.

కానీ డైరక్టర్ రాహుల్ వ్యవహారం తెలిసిన వాళ్లు ఇదంతా అయ్యే పనేనా అని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే యువి/గీతా కలిసి చేస్తేనే, టాక్సీవాలా సినిమా కు రెండేళ్లు పట్టింది. అది కూడా ఓ స్టేజ్ లో డైరక్టర్ మారుతి రంగంలోకి దిగి సినిమా ఎడిట్ చేసి, చక్కదిద్దాల్సి వచ్చింది. రాహుల్ టేకింగ్ చాలా జాగ్రత్తగా, చెక్కినట్లు నెమ్మదిగా వుంటుందని టాక్ వుంది ఇండస్ట్రీలో.

ఇదిలా వుంటే నానికి తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చి, రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరక్టర్ ను తీసుకుంటున్నారు అన్న టాక్ మరోటి వుంది. రెహమాన్ సాదా సీదా మ్యూజిక్ డైరక్టర్ కాదు. కనీసం మూడు కోట్ల రెమ్యూనిరేషన్ వుండే అవకాశం వుంది. అక్కడ కూడా అంత వేగం వర్క్ జరిగే వ్యవహారం కాదు. పైగా రెహమాన్ సరైన మాంచి ట్యూన్ లు ఇచ్చి చాలా కాలం అయిపోయింది. అదీ కాక ఈ సినిమాకు కథ డైరక్టర్ ది కాదని వేరే కథ కొంటున్నారని ఓ టాక్ కూడా వుంది. అలాగే డైలాగ్ రైటర్లు వేరే అని వినిపిస్తోంది.

ఇలా అన్ని విధాలా ఖర్చు, టైమ్ రెండూ పెంచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. దానివల్ల అనుకున్న డేట్ కు విడుదల కావడం కష్టం అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అలాగే నాని మీద ఇప్పుడు పెద్ద బడ్జెట్ లు వర్కవుట్ కావడం లేదు. జెర్సీ సినిమాకు బయ్యర్లు కొంత మందికి డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. లాభాల్లో వాటా అనుకుని, నాని రెమ్యూనిరేషన్ కు సరిపడా కిట్టుబాటు కాక, మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. 

ఇలాంటి నేపథ్యంలో మరీ అత్యుత్సాహంతో సితార సంస్థ తప్పటడుగు వేస్తోందనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. చినబాబు సూపర్ విజన్ వుండి కూడా ఇలా జరగడం ఏమిటో?

కేసీఆర్ ఆదేశించారు మా ప్రయత్నం మేము చేస్తున్నాం