కన్న తండ్రే హంతకుడు.. ఛేదించిన పోలీసులు

కరీంనగర్ లో కొన్ని రోజుల కిందట జరిగిన రాధిక హత్యకేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించారు. ఈ కేసులో కన్నతండ్రే హంతకుడు అని తేల్చారు. ఈ మేరకు తానే కూతుర్ని హత్య చేసినట్టు…

కరీంనగర్ లో కొన్ని రోజుల కిందట జరిగిన రాధిక హత్యకేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించారు. ఈ కేసులో కన్నతండ్రే హంతకుడు అని తేల్చారు. ఈ మేరకు తానే కూతుర్ని హత్య చేసినట్టు అంగీకరించాడు నిందితుడు కొమురయ్య. వివరాల్లోకి వెళ్తే..

రాధిక చిన్నప్పట్నుంచి పోలియోతో బాధపడుతోంది. ఆమె వైద్యానికి ఇప్పటికే 6 లక్షలు ఖర్చుచేశాడు తండ్రి కొమురయ్య. ఈమధ్య రాధికకు మరోసారి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కొమురయ్యే, రాధికను హతమార్చాడు. ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు.

తనపై అనుమానం రాకుండా రాధిక గొంతు కోశాడు కొమురయ్య. ఇంటిలో ఉన్న డబ్బు, నగలు కూడా దాచిపెట్టి.. కూతుర్ని హత్య చేయడంతో పాటు నగలు కూడా పోయాయని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మొదటి రోజు పోలీసులకు కూడా అనుమానం రాలేదు. అయితే ఎప్పుడైతే కొమురయ్య దుస్తులపై రక్తపు మరకలు కనిపించాయో అప్పట్నుంచి అనుమానించడం మొదలుపెట్టారు.

చివరికి పోలీసుల అనుమానమే నిజమైంది. హత్య జరిగిన 20 రోజుల తర్వాత కొమురయ్య నిజం అంగీకరించాడు. తన కూతుర్ని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

అన్నయ్య గురుంచి ఎవడైనా బ్యాడ్ గా మాట్లాడితే చంపేస్తా