శ్రీకారం తొలిరోజు 4 కోట్లు

శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన సినిమా శ్రీకారం. రైతు సమస్యలపై నిర్మించిన ఈ సినిమాను మెగాస్టార్,  మంత్రి కేటిఆర్ ప్రమోట్ చేయడం కలిసి వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి.…

శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన సినిమా శ్రీకారం. రైతు సమస్యలపై నిర్మించిన ఈ సినిమాను మెగాస్టార్,  మంత్రి కేటిఆర్ ప్రమోట్ చేయడం కలిసి వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు నాలుకు కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అయితే వీటిలో చాలా చోట్ల ఫిక్స్ డ్ హయ్యర్లు వంటివి వున్నాయి. ముఖ్యంగా గుంటూరులో కాస్త ఎక్కువ.  వాటిని కట్ చేసినా కూడా సినిమా మూడు కోట్లకు పైగానే తొలి రోజు వసూలు చేసింది.

శుక్ర, శని, ఆదివారాల్లో కూడా ఇదే మాదిరిగా గట్టిగా వసూళ్లు సాగించాల్సి వుంది.  ఎందుకంటే ఆంధ్రలో బయ్యర్లు రికవరీ కావాలంటే ఆ మేరకు కలెక్షన్లు వుండాలి. అయితే వరుస సెలవులు కాబట్టి వుంటాయనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Nizam…1.10C , Ceaded..75L ,Vizag…54L , Krishna..25L , Guntur..65L , East..30L , West..28L ,Nellore..14L

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జాతి రత్నాలు మూవీ పబ్లిక్ టాక్