చాలా నెలల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా స్టిల్ వచ్చింది. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ అది. అయితే పాపం, ఫ్యాన్స్ కు ఏ మాత్రం హ్యాపీగా వుండకపోవచ్చు. ఎందుకంటే ఏమాత్రం కొత్త స్టిల్ కాదు. స్టిల్ లో పవన్ డ్రెస్ మారింది తప్ప, గెడ్డం, భారీగా పెరిగిన జుట్టు మారలేదు. నిజానికి సినిమాలో ఈ లుక్ తో పాటు, మామూలు హీరోయిక్ లుక్ కూడా వుంటుంది. కానీ ముందుగా ఈ స్టిల్ నే వదిలారు.
ఓ ఏస్ వాన్ లో రకరకాల న్యాయశాస్త్ర పుస్తకాలు, కుర్చీ టేబులు వగైరా వేసుకుని, ఠీవీగా ఈ కుర్చీ నుంచి ఆ కుర్చీకి సాగి పడుకున్న పవన్ కళ్యాణ్ ను స్టిల్ లో చూపించారు. చేతిలో పుస్తకం వుంది కానీ, పవన్ చూపులు ఎక్కడో వున్నాయి. పైగా కుర్చీలో అలా సాగి పడుకున్న స్టిల్ కావడంతో, మెడ లోపలకు దిగినట్లు, ఏదోలా వుంది.
మొత్తం మీద..'నాపేరు బికారి, నాదారి ఎడారి..మనసున్న చోట మజిలీ..కాదన్ననాడు బదిలీ..' అనే పాటను గుర్తుకు తెచ్చింది..' ఈ స్టిల్. లేదా రాజకీయాల నుంచి సినిమాలకు షిప్ట్ అవుతున్నా అని సింబాలిక్ గా చెప్పినట్లుంది.
దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించే ఈ వకీల్ సాబ్ కు శ్రీరామ్ వేణు దర్శకుడు.