సూఫీ స్టయిల్ ట్యూన్ అన్నది మన సినిమా పాటల శ్రోతలకు తక్కువ పరిచయం. నెమ్మదిగా, వాక్యంలా సాగుతూ, ట్యూన్ కు తక్కువ అంతే సూఫీ స్టయిల్ వాడి మన తెలుగు శ్రోతలను మెప్పించడం అంత సులువు కాదు. ఎఆర్ రెహమాన్ మాత్రమే ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. అలాంటి సూఫీ స్టయిల్ లో సాంగ్ చేసి అందించారు దేవీశ్రీప్రసాద్ ఉప్పెన సినిమా కోసం.
నీనవ్వు పడవ ప్రయాణం, నా మనుసేమో అందులో పడవ ప్రయాణం అంటూ సాగే శ్రీమణి రాసిన సాంగ్ ను అందించారు. సాధారణంగా పాత ట్యూన్ లు అందిస్తాడని కంప్లయింట్ వస్తుంటుంది. దేవీశ్రీప్రసాద్ ఈసారి దాన్ని అధిగమించడానికి చాలా ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఉప్పెన సాంగ్ గతంలో దేవీ పాటల్లాగే జనాల నోటికి పట్టడానికి, జనాల్లోకి బాగా వెళ్లడానికి కాస్త టైమ్ పట్టేలాగే వుంది.
పల్లవి హుక్ లైన్లు టక్కున పట్టేస్తాయి కానీ, పాటలో రాను రాను వచ్చిన చరణాల్లో ఫక్తు సూఫీ స్టయిల్ ట్యూన్ మాత్రం జనాలకు పట్టడానికి కొంత టైమ్ పడుతుంది. మాంచి విజువల్స్ కూడా జోడవ్వాలి. లిరికల్ విడియోలో వదిలిన ఒకటి రెండు స్టిల్స్ బాగున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి నిర్మించే ఈ సినిమాకు సానా బుచ్చిబాబు దర్శకుడు.