ఆర్ఆర్ఆర్… ఇప్పుడు టాలీవుడ్ సినిమా అభిమానుల దృష్టి అంతా దాని మీదే. అప్పుడే షూట్ స్టార్ట్ అయి రెండు రోజులు అయింది. ఫస్ట్ షెడ్యూలు తరువాత గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో మళ్లీ స్టార్ట్ చేస్తారు. ఇదిలా వుంటే బాహుబలి సినిమాతో రాజమౌళి నేషనల్, ఇంటర్నేషనల్ డైరక్టర్ అయిపోయారు. కానీ అంత మాత్రాన బాలీవుడ్ సినిమాను భారీ రేట్లకు మార్కెట్ చేయాలంటే అదిచాలదు. మరింత స్టార్ అట్రాక్షన్ కావాలి. శంకర్, రజనీ కలిసినా అక్షయ్ కుమార్ ను విలన్ గా రోబో 2.0లో తీసుకున్నది అందుకే.
ఇప్పుడు రాజమౌళి కూడా అదే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలికి రానా వున్నాడు. కాస్త బాలీవుడ్ కు పరిచయమే. ఇక్కడ రామ్ చరణ్ కూడా బాలీవుడ్ కు పరిచయమే. కానీ వందల కోట్ల రేంజ్ లో మార్కెట్ చేయాలంటే ఇంకా మరింత స్టార్ బలం కావాలి.
అందుకే ఆర్ఆర్ఆర్ లో ఓ హిందీ హీరోను తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు, అజయ్ దేవగన్ అని కూడా వినిపిస్తోంది. అజయ్ దేవగన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద దృష్టి వుంది. గతంలో చంద్రబాబును కలిసి స్డూడియో గురించి, ఎంటర్ టైన్మెంట్ ప్రాజెక్టుల గురించి మాట్లాడిన సందర్భం కూడా వుంది.
సో, అన్నివిధాలా సరిపోతుందనే ఆలోచనతో, అజయ్ దేవగన్ ను ఆర్ఆర్ఆర్ లోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు వినిపిస్తోంది. కానీ మరి ఏ పాత్రకు తీసుకుంటారు? విలన్ గానా? అన్నది తెలియదు. ఈగ సినిమాలో సుదీప్ ను, బాహుబలిలో సత్యరాజ్ తీసుకుని వాళ్ల పాత్రలను బాగా హైలైట్ చేసారు. అందువల్ల రాజమౌళి అడగాలే కానీ ఏ పాత్ర అయినా అజయ్ దేవగన్ కాదనకపోవచ్చు.
రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్