ఎక్స్ క్లూజివ్..దిల్ రాజు-విక్రమ్ కుమార్- చైతన్య

ఓ మాంచి కాంబినేషన్ తెరపైకి వచ్చేందుకు టాలీవుడ్ లో డిస్కషన్లు మొదలయ్యాయి. జోష్ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లో నాగ్ చైతన్య సినిమా చేసేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. అఖిల్ తో…

ఓ మాంచి కాంబినేషన్ తెరపైకి వచ్చేందుకు టాలీవుడ్ లో డిస్కషన్లు మొదలయ్యాయి. జోష్ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లో నాగ్ చైతన్య సినిమా చేసేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. అఖిల్ తో హలో చేసిన డైరక్టర్ విక్రమ్ కుమార్ ఈసారి చైతన్యతో సినిమా చేసే ఆలోచనలో వున్నారు. మనం తరువాత మళ్లీ చైతూ-విక్రమ్ కుమార్ కాంబినేషన్ రిపీట్ అన్నమాట.

ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ వుంది. ఈ ప్రాజెక్టుకు మరో డైరక్టర్ బివిఎస్ రవి కథ అందించడం. దిల్ రాజు బ్యానర్ ప్రెజెంటేషన్ లో జవాన్ సినిమా చేసిన ఆయన ఓ మాంచి కథ తయారు చేసి దిల్ రాజుకు అందించినట్లు తెలుస్తోంది. బేసిక్ గా రవి కథకుడే. అందుకే దర్శకత్వం కోసం పట్టుపట్టకుండా కథ అందించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి చేతినిండా సినిమాలతో బిజీగా వున్న చైతూ కథ అయితే విన్నాడు. ఓకె అన్నాడని బోగట్టా. అయితే ఎప్పుడు చేస్తాడో? ఏమిటో? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. లవ్ స్టోరీ పూర్తి కావాలి.బంగార్రాజు వ్యవహారం ఒకటి వుంది. నాగేశ్వరరావు సంగతి తేలాలి. అప్పుడు విక్రమ్ కుమార్ సినిమా ఫైనల్ అవుతుంది.

నాన్ను బే అంటావా.. అవును అంటాను బే ..

‘మెగాస్టార్ ది లెజెండ్’ పుస్తకావిష్కరణ