మనసా..మనసా..మళ్లీ సిద్ శ్రీరామ్

మనవాళ్లకు ఏం నచ్చినా ఇక అదే పోక..అదే వరస. గీత గోవిందం సినిమాతో జిఎ2 బ్యానర్ ఓ మాంచి మ్యూజికల్ హిట్ ను సిద్ శ్రీరామ్ తో అందించింది. దాంతో అదే వరుసలో అల్లు…

మనవాళ్లకు ఏం నచ్చినా ఇక అదే పోక..అదే వరస. గీత గోవిందం సినిమాతో జిఎ2 బ్యానర్ ఓ మాంచి మ్యూజికల్ హిట్ ను సిద్ శ్రీరామ్ తో అందించింది. దాంతో అదే వరుసలో అల్లు శిరీష్ కు ఓ సాంగ్ వచ్చింది. ఆ తరువాత అదే గీతా సంస్థలో అల వైకుంఠపురములో సంచలనం సృష్టించే సాంగ్ ను సిద్ శ్రీరామ్ తో అందించారు.

ఇప్పుడు మళ్లీ జిఎ2 మరోసారి సిద్ శ్రీరామ్ తో ఓ పాట అందిస్తోంది. ఈసారి అఖిల్ కోసం. ఈ పాటను బయటకు విడుదల చేసారు. 

''..మనసా..మనసా..మనసారా బతిమాలా..తన వలలో పడబోకే మనసా..పిలిచా..అరిచా..అయినా నువు వినకుండా తనవైపు వెళతావే మనసా..''

అంటూ సాగే పాటను సురేంద్ర కృష్ణ రచించారు. సిద్ శ్రీరామ్ వాయిస్ టిపికల్ గా వుంటుంది. అందువల్ల చాలా రేర్ గా వాడుకోవాలి ఇలాంటి వాయిస్ లను. వెంటవెంటనే వాడేసుకుంటే, రిపిటివ్ అనిపించే ప్రమాదం వుంది. పైగా ఈ పాటలో గోపీసుందర్ ఇనుస్ట్రుమెంటేషన్ కూడా అల వైకుంఠపురములో డ్రమ్మింగ్ స్టయిల్. గిటార్ స్టయిల్ ను గుర్తుకు తెచ్చేదిలా వుంది.

ఈ విషయం పక్కన పెడితే, పాట సాహిత్యం లాలిత్యంగా వుండి, యంగ్ లవర్స్ అందరూ పాడుకునేలా, క్యాచీగా వుంది.