కాస్టింగ్ కౌచ్ విషయంలో స్పందించింది తమిళ స్టార్ హీరో, రాజకీయ నేత శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. పలు తమిళ సినిమాల్లో నటించి, వాటి అనువాదాల ద్వారా తెలుగు వారిలో కూడా గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి తను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని అంటోంది! తనను కూడా కొంతమంది కాంప్రమైజ్ కావాలంటూ కోరారని వరలక్ష్మి చెప్పడం గమనార్హం. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. హీరోయిన్లను ప్రొడ్యూసర్లు అడుగుతారని, అవకాశాలను కోరే అమ్మాయిల నుంచి పరిశ్రమ వ్యక్తులు ఆ ఫేవర్ కోరతారని వరలక్ష్మి చెప్పింది.
తను ఇండస్ట్రీలో ఒక పేరున్న, స్టార్ హీరో కూతురినే అయినా.. హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నాల్లో ఉండగా, తనను కూడా కాంప్రమైజ్ కావాలని కొంతమంది అడిగారని ఈమె చెప్పింది. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, కొన్ని ఫోన్ కాల్స్ రికార్డింగులు ఉన్నాయని ఈ హీరోయిన్ చెప్పింది! కొంతమంది నిర్మాతలు తనను ఆ విషయంలో ఫేవర్ కోరారని, అవకాశం ఇచ్చేందుకు ప్రతిఫలంగా వారు తన నుంచి అది ఎక్స్ పెక్ట్ చేశారని చెప్పింది. అయితే తను అలాంటి వారికి నో చెప్పినట్టుగా వరలక్ష్మి స్పష్టం చేసింది.
ఇండస్ట్రీలో మనుగడ సాగించడానికి రెండు మార్గాలున్నాయని, ఒకటి కాస్టింగ్ కౌచ్ ఒత్తిళ్లకు కాంప్రమైజ్ కావడం, రెండోది గట్టిగా నో చెప్పగలగడం అని ఈ హీరోయిన్ అంటోంది. మొదటిది చేయాలంటే చాలా కఠినం అని, రెండోది ఛాయిస్ అని, దీని వల్ల అవకాశాలు రాకపోవచ్చని ఈమె చెప్పింది. తను ఇప్పటి వరకూ 25 సినిమాలు చేసినట్టుగా, మంచి ప్రొడ్యూసర్లు- డైరెక్టర్లతోనే ఆ సినిమాలు చేసినట్టుగా.. కాంప్రమైజ్ లకు నో చెబుతూనే 29 వ సినిమాకు సైన్ చేసినట్టుగా శరత్ కుమార్ తనయ చెప్పింది!