వాణిజ్య ప్రధాన కథతో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. సినిమా టైటిల్ కాస్తా డిఫరెంట్‌గా ఉంది కదూ! అవును మరి, టైటిలే కాదు…సినిమా కూడా అట్లే ఉంటుందట. ఈ మాట ఆ చిత్ర దర్శకుడు కరుణకుమార్ అంటున్నాడు. ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలను దర్శకుడు పంచుకున్నాడు.
‘జానపద కళలు మన వారసత్వ సంపద. జనం నుంచి పుట్టిన కళలు ఎప్పటికీ సజీవమే. ఆ సంపదను నాశనం చేసుకుంటున్నాం. అంతే కాదు కొన్ని జీవితాలు ఛిద్రమవుతున్నాయి. దీని వెనుక కనిపించని మార్కెట్ దుష్టశక్తులున్నాయి. ఆ విషయాన్ని వాణిజ్య ప్రధాన కథా నేపథ్యంతో తెరకెక్కించిన చిత్రమే పలాస 1978’ అని కరుణ కుమార్.
‘సిటిజన్ కేన్’ సినిమా తరహాలో ఈ కథని మూడు తరహా పాత్రలు చెబుతుంటాయన్నాడు. అంతేకాదు, ప్రతి ఐదు నిమిషాలకు కథ మారిపోతుంటుందని, చిత్ర పరిశ్రమలో చాలా ఈ సినిమాను చూశారన్నాడు. అంతేకాదు, గత 25 ఏళ్లలో ఇలాంటి కథతో సినిమా రాలేదని చెప్పడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని కరుణ తెలిపాడు. ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం తనకుందన్నాడు.
తనకిది ఐదో సినిమా అని , తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కిందన్నాడు. కాగా ఇంకో ప్రధాన విషయం ప్రేక్షకులతో అతను పంచుకున్నాడు. ఈ సినిమా చూసిన నెన్సార్ బోర్డు అక్షరాలా 25 కట్స్ ఇచ్చిందని చెప్పి…అందర్నీఆశ్చర్యపరిచాడు. అయితే తాము రివైజింగ్ కమిటీకి వెళితే….అక్కడ రెండు సంభాషణల్ని మాత్రమే తొలగించి సినిమా విడుదలకు అంగీకారం తెలిపారన్నాడు.
కానీ సెన్సార్ వాళ్లు 25 కట్స్ ఇచ్చిన ఆ సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి మాత్రం పెంచింది. దీన్ని చూడాలనే క్యూరియాసిటీని కూడా పెంచింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ నెల 6వ తేదీ వరకు ఎదురు చూడక తప్పదు కదా!