బయోపిక్ లో అనసూయ ఏమిటి?

సాధారణంగా బయోపిక్ లు అంటే ఎక్కువగా ఒరిజినల్ క్యారెక్టర్లే వుంటాయి. కానీ కథను నడిపించడం కోసం అక్కడక్కడ ఫిక్షన్ క్యారెక్టర్లు తప్పవు. మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత చేసినవి ఇలాంటి ఫిక్షన్ క్యారెక్టర్లే.…

సాధారణంగా బయోపిక్ లు అంటే ఎక్కువగా ఒరిజినల్ క్యారెక్టర్లే వుంటాయి. కానీ కథను నడిపించడం కోసం అక్కడక్కడ ఫిక్షన్ క్యారెక్టర్లు తప్పవు. మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత చేసినవి ఇలాంటి ఫిక్షన్ క్యారెక్టర్లే. రాబోయే వైఎస్ బయోపిక్ 'యాత్ర'లో కూడా మూడు నాలుగు ఫిక్షన్ క్యారెక్టర్లు వున్నాయట.

వీటిలో కీలకమైన రెండింటిని గ్లామరస్ యాంకర్ అనసూయ, వెర్సటైల్ యాక్టర్ పోసాని కృష్ణమురళి పోషిస్తున్నారట. అనసూయ చేస్తున్న క్యారెక్టర్ పేరు సుచరిత. వైఎస్ లైఫ్ మొత్తంమీద సుచరిత అనే క్యారెక్టర్ నిజానికి లేదు.

కానీ కథను ముందుకు నడపడంలో భాగంగా సినిమా ఆరంభంలోనే అనసూయ పాత్ర వుంటుందని తెలుస్తోంది. అదే విధంగా పోసాని కృష్ణమురళి కూడా ఓ పాత్ర చేస్తున్నారు. ఇదిలా వుంటే వైఎస్ బయోపిక్ అని ప్రచారం జరుగుతున్నా, సినిమాలో చాలా లైవ్ క్యారెక్టర్ లు మిస్ చేసారని తెలుస్తోంది.

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్లు ఏవీ యాత్రలో వుండవు. ఎక్కువగా ఈ జనరేషన్ జనాలకు తెలియని రాయలసీమ నాయకుల క్యారెక్టర్లు మాత్రం కొన్ని వుంటాయి. వాటిని నాజర్ తదితరులు పోషించారు.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్